Shocking: 93ఏళ్ల తల్లి మృతదేహాన్ని ఫ్రీజర్‌లో దాచిన 64ఏళ్ల కూతురు.. ఆమె చెప్పిన కారణం విని అధికారులు షాక్!

ABN , First Publish Date - 2022-07-11T18:00:41+05:30 IST

ఓ మహిళ తన తల్లి మృతదేహాన్ని ఫ్రీజర్‌లో దాచి ఉంచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె అలా చేయడానికి గల కారణాలు విని.. స్థానిక పోలీసులు అవాక్కయ్యారు. అంతేకాకుండా ఆమెపై పలు సెక్షన్ల కింద

Shocking: 93ఏళ్ల తల్లి మృతదేహాన్ని ఫ్రీజర్‌లో దాచిన 64ఏళ్ల కూతురు.. ఆమె చెప్పిన కారణం విని అధికారులు షాక్!

ఎన్నారై డెస్క్: ఓ మహిళ తన తల్లి మృతదేహాన్ని ఫ్రీజర్‌లో దాచి ఉంచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె అలా చేయడానికి గల కారణాలు విని.. స్థానిక పోలీసులు అవాక్కయ్యారు. అంతేకాకుండా ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 



అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన మహిళకు ప్రస్తుతం 64ఏళ్లు. ఆమె తల్లికి 93ఏళ్లు కాగా.. ఫిబ్రవరిలో ఆమె మృతి చెందింది. అయితే.. ఆ విషయాన్ని తన కూతురు బయట పెట్టలేదు. ఆమె చనిపోయిన విషయాన్ని దాచి.. మృతదేహాన్ని ఫ్రీజర్‌లో భద్రపర్చింది. కూతురి నిర్వాకం ఏప్రిల్‌లో బయటపడింది. దీంతో అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని ఫ్రీజర్‌లో దాచి ఉంచడానికి గల కారణాలపై విచారించారు. ఈ నేపథ్యంలో ఆమె అసలు విషయం బయటపెట్టింది. తన తల్లికి వికలాంగుల పెన్షన్ వస్తుందని.. ఆమె చనిపోయిందనే విషయం బయటకు తెలిస్తే.. పేమెంట్స్ ఆగిపోతాయని చెప్పింది. ఆ డబ్బులకు ఆశ పడి తల్లి మృతదేహాన్ని ఫ్రీజర్‌లో పెట్టినట్టు వివరించింది. దీంతో అధికారులు షాకయ్యారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి.. పోస్ట్‌మార్టం నిర్వహించగా.. వయసు మీద పడటంతో ఆమె మృతి చెందినట్టు వెల్లడైంది. అయితే.. ఆ మహిళపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన అధికారులు.. ఆమెను జైలుకు తరలించారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ అయింది. 


Updated Date - 2022-07-11T18:00:41+05:30 IST