Abn logo
Sep 28 2021 @ 01:11AM

నిలబెట్టిన నమ్మకం.. ఎట్టకేలకు అఫ్ఘాన్ నుంచి California చేరిన America కుటుంబం..

శాన్ రఫేల్: అఫ్గానిస్తాన్‌లో చిక్కుకున్న కాలిఫోర్నియా కుటుంబం ఎట్టకేలకు అమెరికా చేరింది. ఆదివారం ఉదయం అమెరికా నేలపై కాలు మోసిన ఆ కుటుంబం పట్టరాని ఆనందంతో ఎగిరిగంతేసినంత పని చేసింది. అయితే ఒకపక్క ఆనందం ఉన్నా మరోపక్క మాత్రం ఇప్పటికీ అఫ్గానిస్తాన్‌లో ఇరుక్కుపోయిన తమ స్నేహితులు, కుటుంబసభ్యులు, తోటి వారి గురించే వారి ఆలోచనంతా. తాలిబన్ పాలనలో వారు పడుతున్న ఇబ్బుందులను తలుచుకుని బాధ కూడా పడుతున్నారు.

అహ్మద్ సెయర్ జియా.. ఆఫ్గన్లో ఇరుక్కుపోయిన అమెరికన్. తన కుటుంబంతో సహా అక్కడే ఇరుక్కుపోయారు. అయితే సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఎట్టకేలకు ఆదివారం శాన్ ఫ్రాన్సిస్కో‌ విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి శాన్ రాఫేల్‌లోని తమ ఇంటికి చేరుకున్నారు. దీంతో వారి ఆనందానికి అవధుల్లేకుండాపోయింది. ఈ క్షణం ప్రాణం తిరిగొచ్చినట్లైందని అహ్మద్ జియా చెప్పుకొచ్చారు.

‘ఆగస్టులో అఫ్ఘానిస్తాన్ వెళ్లి కొద్ది రోజులు ఉండి తిరిగి రావలని అనుకున్నాం. కానీ అనుకోని విధంగా మా పర్యటన పీడకలగా మారింది. తాలిబన్లు దేశాన్ని హస్తగతం చేసుకోవడంతో ప్రాణాలపై కూడా ఆశలు కోల్పోయాం. చాలా సార్లు కాబూల్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి కుంటుంబంతో సహా అమెరికా వచ్చేందుకు ప్రయత్నించాను. కానీ తాలిబన్ల చేతిలో దారుణంగా దెబ్బలు తిన్నాను. చివరకు ఎలాగోలా అధికారులు సహకారంతో అఫ్గానిస్తాన్ నుంచి తప్పించుకుని అమెరికాకు వచ్చేశాను’ అని సెయర్ వెల్లడించారు.

కాగా.. సెయర్ భార్య, కొడుకు అమెరికా గ్రీన్ కార్డ్ కలిగి ఉన్నారు. అలాగే అతడి కూతుళ్లు అమెరికాలోనే జన్మించడం వల్ల అక్కడి నాగరికత కూడా వారికి లభించింది. మార్చి నెలలో అప్గానిస్తాన్‌లో నివశిస్తున్న తండ్రి మరణించడంతో సెయర్.. కుటుంబంతో సహా అక్కడికి వెళ్లాడు. కానీ తాలిబన్ల దెబ్బకు అక్కడే అంతా ఇరుక్కుపోయారు.

తాజా వార్తలుమరిన్ని...