అమెరికా ఎడారిలో శ్రీచక్రం ఎలా వచ్చింది?

ABN , First Publish Date - 2020-07-07T01:08:18+05:30 IST

శ్రీచక్రం లేదా శ్రీయంత్రం. కశ్మిరీ హైందవ ఆధారితమైన తంత్రంలో ఒక ప్రవిత్రమైన యంత్రం. దీని నిర్మాణం ఒక...

అమెరికా ఎడారిలో శ్రీచక్రం ఎలా వచ్చింది?

శ్రీచక్రం లేదా శ్రీయంత్రం. కశ్మిరీ హైందవ ఆధారితమైన తంత్రంలో ఒక ప్రవిత్రమైన యంత్రం. దీని నిర్మాణం ఒక బిందువు చుట్టూ వివిధ దశల్లో ప్రయాణిస్తూ చిన్న చిన్న త్రిభుజాలు చివరకు రెండు వ్యతిరేక దిశల్లో ఉద్భవించే పెద్ద త్రిభుజాలవలే ఉంటుంది. ఈ యంత్రం శక్తిస్వరూపులైన శ్రీవిద్యాలలితాదేవి లేదా త్రిపురసుందరి అనే దేవతను సూచిస్తాయి. శ్రీచక్రం లేదా శ్రీయంత్రం ఇంట్లో ఉంటే శుభం కలుగుతుందని అంటారు. హిందువులు పవిత్రంగా భావించే ఈ యంత్రం ఒకప్పుడు అమెరికా ప్రజల్ని ఆశ్చర్యపరిచింది. కారణం ఆ దేశంలోని ఓ ఏడాదిలో ఎండిపోయిన సరస్సులో సుమారు ఇరవై రెండు కిలో మీటర్ల వైశాల్యంలో అతిపెద్ద శ్రీచక్రం ప్రత్యక్షంకావడమే. నిత్యం అమెరికా వైమానికదళం నిఘా ఉండే ఈ ప్రాంతంలో శ్రీచక్రం ఎలా ఏర్పడిందనేది ఇప్పటికీ మిస్టరీనే. 


దీని గుట్టు తేల్చలేక అమెరికా పరిశోధకులు సైతం చేతులెత్తేశారు. శ్రీచక్రాన్ని కాగితంపై గీయాలంటేనే ఎంతో కష్టం. అలాంటిది భూమిపై ఎలాంటి తప్పులు, వంకర్లు లేకుండా కచ్చితంగా గీయాలంటే ఎంతో టెక్నాలజీ, అత్యాధునిక పరికరాలు అవసరం. 1990లో డ్రోన్స్ కూడా అందుబాటులో లేవు. మరి శ్రీచక్రం ఎలా ప్రత్యక్షమైంది. దీన్ని ఎలా కనుగొన్నారు. దీనిపై అమెరికా వైమానిక అధికారులు ఏం చెప్పారు?.. చివరకు ఏం తేల్చారు?. దీన్ని మానవులే గీశారా?. లేక గ్రహాంతరవాసులా?. శ్రీచక్రాన్నే గీయడానికి ఎందుకు మొగ్గు చూపారు. ఇప్పటికీ ఇదో మిలియన్ డాలర్ల క్వశ్చన్‌గానే మిగిలింది. 


Updated Date - 2020-07-07T01:08:18+05:30 IST