Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

అమెరికాలో అరుదైన ఘనత సాధించిన భారత సంతతి.. ప్రశంసల వెల్లువ!

twitter-iconwatsapp-iconfb-icon
అమెరికాలో అరుదైన ఘనత సాధించిన భారత సంతతి.. ప్రశంసల వెల్లువ!

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికా ఎయిర్ ఫోర్స్‌లో ఎయిర్‌మ్యాన్‌గా పని చేస్తున్న భారత సంతతి వ్యక్తి అరుదైన ఘనత సాధించాడు. నుదుటిపై తిలకం పెట్టుకుని డ్యూటీకి హాజరయ్యేందుకు ప్రత్యేకంగా అనుమతి పొందాడు. తిలకంతోనే డ్యూటీకి హాజరవుతూ.. ప్రస్తుతం అందరి మన్ననలూ పొందుతున్నాడు. ఇందుకు సంబంధించిన పూర్త వివరాల్లోకి వెళితే..


భారత సంతతికి చెందిన దర్శన్ షా ప్రస్తుతం అమెరికా వైమానిక దశంలో ఎయిర్‌మ్యాన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 2022 ఫిబ్రవరి 22న మొదటి సారిగా నుదుటిపై తిలకం పెట్టుకుని విధలకు హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ఆయనకు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా దర్శన్ షానే వెల్లడించారు. నుదుటిపై తిలకం పెట్టుకునే అంశం గురించి ట్రైనింగ్ స్కూల్‌‌లో ఉండగానే అధికారులతో సంప్రదించినట్టు చెప్పారు. అయితే.. డ్యూటీలో చేరిన తర్వాత అక్కడి అధికారులను సంప్రదించాలని సూచించినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలోనే డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్టు చెప్పారు. తన అభ్యర్థనపట్ల సానుకూలంగా స్పందించిన అధికారులు.. యూనిఫాంలో ఉన్నా తిలకం పెట్టుకునేందుకు అనుమతించారని తెలిపారు. ఈ విషయం తెలిసి టెక్సాస్, కాలిఫోర్నియా, న్యూజెర్సీ తదితర ప్రాంతాల్లో ఉన్న స్నేహితులు తనకు ఫోన్ చేసి అభినందనలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. అంతేకాకుండా ఈ విషయంలో తన తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉన్నట్టు చెప్పారు. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.