Advertisement
Advertisement
Abn logo
Advertisement

భారత్‌కు వచ్చిన ఈ అమెరికన్ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మూడేళ్లుగా జైల్లోనే.. అతడి తప్పేంటంటే..

ముజఫరాపూర్: అమెరికాకు చెందిన ఆ వ్యక్తి మూడేళ్ల క్రితం భారతదేశంలో అరెస్టయ్యాడు. అప్పటి నుంచి సెంట్రల్ జైల్లోనే బతికేస్తున్నాడు. బెయిల్ తీసుకునేందుకు కోర్టు అనుమతిచ్చినా తనవారెవరూ ఇక్కడ లేకపోవడంతో ఇన్నేళ్లుగా జైల్లోనే గడుపుతున్నాడు. అతడి కేసులో మానవహక్కుల శాఖ కలుగజేసుకుని కేసు వివరాల కోసం పోలీసులను కోరుతున్నా ఫలితం లేకపోయింది. ఈ విషయంలో పోలీసు ఉన్నాతాధికారుల నిర్లక్ష్యం కూడా తోడవడంతో అమెరికన్ జాతీయుడు ఇన్నేళ్లుగా జైల్లోనే మగ్గిపోతున్నాడు.

వివరాల్లోకి వెళితే.. డేవిడ్ అనే అమెరికన్ వ్యక్తిని బీహార్‌లోని ముజఫరాపూర్‌, మధుబని ప్రాంత పోలీసులు అతడిని అరెస్టు చేశారు. వీసా లేకుండా భారత్‌లో అడుగుపెట్టడం, ఇక్కడ తిరుగుతుండడంతో 2018 మార్చి 19న డేవిడ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో ప్రవేశపెట్టగా అతడిని దోషిగా తేల్చిన కోర్టు 5ఏళ్ల జైలు శిక్ష, రూ.2వేల రూపాయల జరిమానా విధించింది. అలాగే బెయిల్ తీసుకునేందుకు కూడా అనుమతిచ్చింది. కానీ డేవిడ్‌కు భారత్‌లో ఎవరూ లేకపోవడంతో అతడికి బెయిల్ ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో మూడేళ్లుగా ముజఫరాపూర్ సెంట్రల్ జైల్లోనే డేవిడ్ మగ్గిపోతున్నాడు.

డేవిడ్ కేసుపై మానవహక్కుల శాఖ దృష్టి సారించి, కేసులు న్యాయవాది ఎస్‌కే ఝాకు అప్పగించింది. కేసు పూర్వాపరాల కోసం ఆయన ఎన్నిసార్లు ఐజీకి లేఖలు రాసినా.. ఒక్కసారి కూడా జవాబు రాలేదు. దీంతో ఆయన డీఎస్పీ ద్వారా వివరాలు సేకరించి మానవ హక్కుల శాఖకు నివేదిక సమర్పించారు. డేవిడ్ కేసును సీరియస్‌గా తీసుకున్న మానవ హక్కుల శాఖ ఈ కేసుకు సంబంధించిన ఉన్నతాధికారులందరూ తదుపరి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్ 23న జరగనుంది. కాగా.. భారత్‌లో డేవిడ్‌కు తెలిసిన వారు ఒక్కరు కూడా లేకపోయినా అతడు ఇక్కడికి ఎలా వచ్చాడు..? ఎందుకు వచ్చాడు..? అనే విషయాలు మాత్ర ఇంకా బయటకురాలేదు.


Advertisement
Advertisement