చచ్చినా వదలం...

ABN , First Publish Date - 2022-06-01T17:55:53+05:30 IST

ఎన్నో ప్రయాసల కోర్చి వైద్యం కోసం ఆసుపత్రులకు పలు ప్రాంతాల నుంచి వస్తుంటారు. అయితే విధి వక్రించి మృతి చెందిన వారి కుటుంబీకులకు అంబులెన్స్‌

చచ్చినా వదలం...

- మృతదేహాలను తరలించాలంటే భారీగా చెల్లించాల్సిందే..

- ఇష్టారాజ్యంగా అంబులెన్స్‌ చార్జీల వసూలు

 - అధిక భారంతో సామాన్యుడు విలవిల

- దూరాన్ని బట్టి ధరలు నిర్ణయించాలని బాధితుల వేడుకోలు


బళ్లారి(బెంగళూరు): ఎన్నో ప్రయాసల కోర్చి వైద్యం కోసం ఆసుపత్రులకు పలు ప్రాంతాల నుంచి వస్తుంటారు. అయితే విధి వక్రించి మృతి చెందిన వారి కుటుంబీకులకు అంబులెన్స్‌ డ్రైవ ర్లు చుక్కలు చూపిస్తున్నారు. మృతదేహాలను ఇంటికి తీసుకెళ్ళెందుకు వారి బంధువులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అసలే ఆప్తులను పోగొట్టుకుని పుట్టెడు దుఖఃంలో ఉన్న  కుటీంబీకులకు  ఆసుపత్రి నుంచి మృతదేహాలను స్వస్థలాలకు తీసుకెళ్లాలంటే ఖర్చులు తడిసి మోపెడు అవుతన్నాయి. కొందరు అంబులెన్స్‌ నిర్వాహకులు ఇష్టరాజ్యంగా డబ్బులు వసూలు చేస్తుండగా మరికొందరు మానవతాదృక్పదంగా వ్యవహరిస్తున్నారు. బళ్లారిలో వివిధ ఆసుపత్రులకు వైద్యం కోసం వివిథ ప్రాం తాలనుంచి ఇక్కడున్న ప్రైవేట్‌ ప్రభుత్వ ఆసుపత్రులకు రోగులు వస్తుంటారు. అన్నీ బాగుంటే చికిత్స జరిగి ఇంటికి వెళతారు. విధి వక్రించి చనిపోయిన వారి మృతదేహాలను బందువులు ఆసుపత్రి నుంచి వారి స్వగ్రామలకు తరలించేందుకు నానా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని స్వచ్చంద సంస్థలు సేవా భావంతో ఉచిత అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు. అయితే కొందు మాత్రం ఏమాత్రం దయా, దాక్షిణ్యం లేకుండా అధిక వసూళ్లకు పాల్పడుతున్నారు. మృతదేహాన్ని కనీసం 20కిలోమీర్ల దూరం ఉన్న ఊరికి  తరలించాలన్నా రూ. 10-15వేల వరకు డబ్బులు వసూలు చేస్తున్నారు. కుటుంబంలో వ్యక్తిని కోల్పోయి పుట్టెడు దుఖఃంతో ఉన్న వీరికి మృతదేహాన్ని తరలింపులో అంబులెన్స్‌ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా చేస్తున్న వసూళ్లు మరింత బాధతను కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవైట్‌ ఆసుపత్రుల దగ్గర ఉండే అంబులెన్స్‌దారులు అధిక వసూళ్లకు పాల్పడుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. ఇందులో కూడా కొన్ని అంబులెన్స్‌లు ఏమాత్రంకం డీషన్‌ లేకుండా ఉండటం, అందులో  సౌకర్యాలు కూడా అరకొరగానే ఉంటున్నాయి. అయినా అధిక వసూళ్లతో చుక్కలు చూపుతున్నారు. అంబులెన్స్‌ దారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని బాదితులు కోరుతున్నారు. అధికారులు ఇందులో కలగజేసుకుని దూరం బట్టి ధరలను నిర్ణయించాలని వారు కోరుతున్నారు.

Updated Date - 2022-06-01T17:55:53+05:30 IST