గర్భిణిని తీసుకెళుతున్న అంబులెన్స్‌కు అడ్డు తగిలిన సింహాలు.. చివరికి..

ABN , First Publish Date - 2020-05-21T22:40:35+05:30 IST

గుజరాత్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళను అంబులెన్స్‌లో...

గర్భిణిని తీసుకెళుతున్న అంబులెన్స్‌కు అడ్డు తగిలిన సింహాలు.. చివరికి..

గిర్‌సోమనాథ్: గుజరాత్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. గిర్‌సోమనాథ్ జిల్లాలో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా దారి మధ్యలో నాలుగు సింహాలు ఆ అంబులెన్స్‌కు అడ్డు తగిలాయి. ఎంతసేపటికీ కదల్లేదు. రాత్రి వేళ కావడం, పైగా వెళ్లడానికి వేరే మార్గం లేకపోవడంతో చేసేదేమీ లేక ఆ అంబులెన్స్ డ్రైవర్ వాహనాన్ని నిలిపివేశాడు. ఆ గర్భిణి అంబులెన్స్‌లోనే బిడ్డకు జన్మనిచ్చింది. దాదాపు 20 నిమిషాల పాటు అంబులెన్స్‌ను అడ్డగించిన ఆ నాలుగు సింహాలు ఎట్టకేలకు అడవిలోకి వెళ్లిపోయాయి. దీంతో.. అంబులెన్స్‌లో ఆ గర్భిణిని ఆసుపత్రికి తరలించారు. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.



Updated Date - 2020-05-21T22:40:35+05:30 IST