అదృష్టం అంటే ఆ అంబులెన్స్ డ్రైవర్‌దే.. రూ.270తో ఏకంగా కోటీశ్వరుడు అయిపోయాడు!

ABN , First Publish Date - 2021-12-13T18:45:09+05:30 IST

అదృష్టం ఎవరిని, ఎప్పుడు, ఎలా వరిస్తుందో చెప్పలేం. టైమ్ బాగుంటే ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది.

అదృష్టం అంటే ఆ అంబులెన్స్ డ్రైవర్‌దే.. రూ.270తో ఏకంగా కోటీశ్వరుడు అయిపోయాడు!

అదృష్టం ఎవరిని, ఎప్పుడు, ఎలా వరిస్తుందో చెప్పలేం. టైమ్ బాగుంటే ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది. రాత్రికి రాత్రే కోటీశ్వరులను చేస్తుంది. తాజాగా ఓ అంబులెన్సు డ్రైవర్‌ను అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది. లాటరీ టికెట్ రూపంలో అతడిని అదృష్టం వరించింది. అతను కొన్న లాటరీ టికెట్​ కొన్ని గంటల్లోనే అతడిని కోటీశ్వరుడిని చేసింది. బెంగాల్​లోని తూర్పు వర్ధమాన్ జిల్లాకు చెందిన షేక్ హీరా అంబులెన్స్ డ్రైవర్‌‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 


ఇటీవల ఒక రోజు ఉదయం అతను రూ.270 పెట్టి లాటరీ టికెట్ కొన్నాడు. మధ్యాహ్నానికే అతడికి షాకింగ్ విషయం తెలిసింది. తన కొన్న టికెట్‌కు రూ.కోటి జాక్​పాట్ తగిలినట్టు తెలిసింది. లాటరీ టికెట్ తగలగానే ఏం చేయాలో అర్థంకాక సహాయం కోసం పోలీస్​స్టేషన్​కు వెళ్లాడు. వారు హీరాను జాగ్రత్తగా తీసుకెళ్లి ఇంటివద్ద దిగబెట్టి వచ్చారు. తాను ఆర్థిక కష్టాల్లో ఉన్నానని, ఈ డబ్బు తనకు చాలా డబ్బు అవసరమని హీరా చెప్పాడు. 


ముందు అనారోగ్యంతో ఉన్న తన తల్లికి చికిత్స చేయిస్తానని, ఆ తర్వాత ఓ ఇల్లు కొనుక్కుంటానని హీరా చెప్పాడు. ఇక, తాను ఎన్నోఏళ్లుగా లాటరీ వ్యాపారం చేస్తున్నానని, తన అమ్మిన టికెట్లకు ఇంత పెద్ద మొత్తంలో జాక్​పాట్ తగలడం ఇదే మొదటిసారి అని లాటరీ టికెట్ అమ్మిన వ్యక్తి చెప్పాడు. తన షాపులో టికెట్ కొన్న వ్యక్తికి రూ. కోటి జాక్​పాట్ రావడం సంతోషంగా ఉందన్నాడు.

Updated Date - 2021-12-13T18:45:09+05:30 IST