అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి

ABN , First Publish Date - 2021-04-13T05:24:47+05:30 IST

మహానీయుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయ సాధన కోసం ఆయన చూపిన స్ఫూర్తితో ప్రతీ ఒక్కరు ముందుకు సాగాలని ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు అన్నారు.

అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలి
అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు

-ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు

లింగాల, ఏప్రిల్‌ 12: మహానీయుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయ సాధన కోసం ఆయన చూపిన స్ఫూర్తితో ప్రతీ ఒక్కరు ముందుకు సాగాలని ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు అన్నారు. సోమవారం మండల పరిధిలోని ధారారం గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ  అచ్చంపేట నియోజకవర్గం ప్రజలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే సంకల్పంతో పనులు అమలు చేస్తున్నట్లు అన్నారు.  ప్రతీ ఎకరా సెంటు భుములకు సాగునీరు అందించేందుకు అసెంబ్లీలో ప్రస్తావించగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించి సాగునీటి కాల్వల నిర్మాణం కోసం సర్వే ప్రారంభించేందుకు అనుమతులను ఇచ్చారని అన్నారు. వచ్చే రెండు సంవత్సరాలలోపు పనులు పూర్తి చేసి సాగునీరు అందిస్తామని అన్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి సతీష్‌మాదిగ, సర్పంచులు లావుడ్యి కవిత, కోనేటి తిరుపతయ్య, సింగిల్‌ విండో చైర్మన్‌, వైస్‌చైర్మన్‌, హన్మంత్‌రెడ్డి, కంప వెంకటగిరి, ఉప సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు శ్రీనునాయక్‌, అంబేడ్కర్‌ సంఘం నాయకులు మహేష్‌, కుమార్‌, విరస్వామి బుచ్చయ్య, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.


అభివృద్ధి పథంలో అచ్చంపేట

 అచ్చంపేట టౌన్‌: అచ్చంపేట నియోజక వర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 14న ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ రాన్నునట్లు తెలిపారు. పట్టణంలో రూ17.50కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు, వాటికి శంకుస్థాపన కార్యాక్రమానికి రాన్నునట్లు తెలిపారు. అంతకుముందు బస్తీబాటలో భాగంగా 4,13వ వార్డులో పర్యటించి కాలనీలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్‌టీఆర్‌ మినీస్టేడియంలో పనులను పరీశీలించారు. రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్‌, నాయకులు నర్సింహగౌడ్‌,  రాజేశ్వర్‌ రెడ్డి పాల్గొన్నారు.



Updated Date - 2021-04-13T05:24:47+05:30 IST