అంబేద్కర్‌పై ఒలకబోసిన ప్రేమంతా ఏమైపోయింది?

ABN , First Publish Date - 2022-07-15T01:32:16+05:30 IST

ఏపీ(AP)లో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం (Ambedkar Overseas Vidya Nidhi Scheme) ద్వారా విదేశాల్లో చదువుకునే ఎస్సీ..

అంబేద్కర్‌పై ఒలకబోసిన ప్రేమంతా ఏమైపోయింది?

అమరావతి (Amaravathi): ఏపీ(AP)లో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం (Ambedkar Overseas Vidya Nidhi Scheme) ద్వారా విదేశాల్లో చదువుకునే ఎస్సీ (Sc), ఎస్టీ (St), ఈబీసీ (Obc), బ్రహ్మణ (Brahmana) విద్యార్థులకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల ఆర్థిక సాయం ప్రభుత్వం (Government) అందజేస్తుంది. కుటుంబ ఆదాయం రూ.6 లక్షల లోపు ఉన్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే నిరుపేద విద్యార్థులకు ఈ పథకం గొప్ప అవకాశం. యూఎస్ (Us), యూకే (Uk), ఆస్ట్రేలియా (Astralia), పిలిప్పీన్స్ (Philippines), సింగపూర్ (Singapore) లాంటి దేశాల్లో మేనేజ్ మెంట్ (Management), ఇంజినీరింగ్ (Engineering), మెడిసిన్ (Medicine) వంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు చదివేందుకు అంబేద్కర్ విద్యానిధి పథకం ద్వారా ఏ ప్రభుత్వమున్నా డబ్బులు అందజేశాయి. 


అయితే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Ap Cm Jagan Mohan Reddy) మాత్రం ఆ పథకం పేరు మార్చేశారు. అంబేద్కర్ పేరు తీసి ఆయన పేరు పెట్టుకున్నారు. దీంతో జగన్ అసలు రూపం బయటపడింది. ఇటీవలకాలంలో ఏపీ ప్రభుత్వం జిల్లాలను విభజించింది. కోనసీమ (Konaseema)కు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టింది. దాంతో కోనసీమ భగ్గుమంది. అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. కానీ అదంతా ప్రతిపక్షాలు చేశాయని ప్రభుత్వం ఆరోపించింది. ఆ పార్టీలకు చెందిన నేతలపై కేసులు నమోదు చేసింది.  ఆ తర్వాత అంబేద్కర్ కోనసీమ జిల్లాను అధికారికంగా ప్రకటించింది. 


తాజాగా అంబేద్కర్ విద్యానిధి పథకానికి జగన్ పేరును పెట్టుకున్నారు. దీంతో అంబేద్కర్‎పై జగన్‌కు ఉన్న గౌరవమేంటో అర్ధమైందని విపక్ష పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు. 


ఈ నేపథ్యంలో ‘‘అంబేద్కర్‌పై ఒలకబోసిన ప్రేమంతా ఏమైపోయింది?. కోనసీమ జిల్లా పేరుతో చేసిన రాద్ధాంతం ఏమైంది?. దళిత విద్యార్థుల విదేశీ పథకం పేరెందుకు మారింది?. అంబేద్కర్ పేరు తీసేసి మీ పేరు ఎందుకు పెట్టుకున్నారు?. దళితులకు సమాధానం చెప్తారా?.. బుల్డోజ్ చేసేస్తారా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు.



Updated Date - 2022-07-15T01:32:16+05:30 IST