అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాను కొనసాగించాలి

ABN , First Publish Date - 2022-05-26T05:52:46+05:30 IST

కాకినాడ సిటీ, మే 25: అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాను కొనసాగించాలని వామపక్ష, దళిత, ప్రజా సంఘాల నాయకులు కోరారు. అమలాపురంలో మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లు, బస్సులను దగ్ధం చేయడాన్ని ఖండిస్తూ బుధవారం కాకినాడ ఇంద్రపాలెం వంతెన సెంటర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ ఘటనకు కారకులైన విధ్వంసకారులు, కుట్రదారులను తక్షణం అరెస్టు చేయాలని నాయకులు డి

అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాను కొనసాగించాలి
కాకినాడలో నిరసన తెలుపుతున్న నాయకులు

వామపక్ష, దళిత, ప్రజాసంఘాల నాయకుల నిరసన

కాకినాడ సిటీ, మే 25: అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాను కొనసాగించాలని వామపక్ష, దళిత, ప్రజా సంఘాల నాయకులు కోరారు. అమలాపురంలో మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లు, బస్సులను దగ్ధం చేయడాన్ని ఖండిస్తూ బుధవారం కాకినాడ ఇంద్రపాలెం వంతెన సెంటర్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ ఘటనకు కారకులైన విధ్వంసకారులు, కుట్రదారులను తక్షణం అరెస్టు చేయాలని నాయకులు డిమాండ్‌ చేశారు. శనివారం సాయంత్రం 6 గంటలకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని పి లుపునిచ్చారు. కన్వీనర్లు జె.వెంకటేశ్వర్లు, ఏనుగుపల్లి కృష్ణ, గౌరవ అధ్యక్షుడు అయితాబత్తుల రామేశ్వరరావు, నాయకులు గుడాల కృష్ణ, పిట్టా వరప్రసాద్‌, అయినాపురపు సూర్యనారాయణ, దువ ్వ శేషబాబ్జి, ఎం.రాజశేఖర్‌, తోకల ప్రసాద్‌, పలివెల వీరబాబు, తాళ్లూరి రాజు, బచ్చల కామేశ్వరరావు, టి.నూకరాజు, చెంగలరావు, క్రిస్టఫర్‌, వల్లూరి సత్తిబాబు, నాగబత్తుల సూర్యనారాయణ, పప్పు దుర్గా రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-26T05:52:46+05:30 IST