అంబేద్కర్‌ జయంతి వేడుకలకు అనుమతి ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-04-11T06:13:41+05:30 IST

భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి వేడుకలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని జిల్లా దళిత సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

అంబేద్కర్‌ జయంతి వేడుకలకు అనుమతి ఇవ్వాలి
సమావేశంలో మాట్లాడుతున్న దళిత సంఘాల నేతలు

 జిల్లా దళిత సంఘాల డిమాండ్‌ 

జగిత్యాల అర్బన్‌, ఏప్రిల్‌ 10: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి వేడుకలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని జిల్లా దళిత సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం జగిత్యాల ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడు తూ ఉప ఎన్నికల ప్రచారాలకు, సినిమా థియేటర్లకు, క్లబ్‌లకు, పబ్‌లకు, బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లకు లేని నిబంధనలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏప్రిల్‌ 14 అంబేడ్కర్‌ జయంతి వేడుకలకు ఎందుకు అని ప్రశ్నించారు. అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలను గ్రామ గ్రామాన నిర్వహించి అంబేడ్కర్‌ ఆశయాలను కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా దళిత సంఘాల బాధ్యులు దుమాల గంగారాం, చిత్తారి ప్రభాకర్‌, వేల్పుల ప్రవీణ్‌, నర్ర రాజేందర్‌, గంగాధర నరేష్‌, పడిగెల మల్లయ్య, భోనగిరి కిషన్‌ తదితరులున్నారు.

Updated Date - 2021-04-11T06:13:41+05:30 IST