Abn logo
Sep 27 2020 @ 17:59PM

అమ్మో అంబటి.. వరుసగా ఏంటీ అక్రమాలు!

Kaakateeya

అంబటి రాంబాబు వైసీపీలో అత్యంత వివాదాస్పదమైన నాయకుల్లో ఒకరిగా మారుతున్నారు. వరుసగా వివదాల్లోకి ఎక్కుతున్నారు. ఆయనపై వస్తున్న ఆరోపణలన్నీ సొంత పార్టీ నేతలే చేస్తుండటమే ఇందులో ట్విస్ట్. ఇక మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో తనకు కేబినెట్ బెర్త్ దక్కచేసేందుకే ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నారని అంబటి రాంబాబు పార్టీ నేతలకు చెప్పుకుంటున్నారు. 

సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గంలోని ప్రతిచోట అనుచరుల పేరుతో ఆయన లెక్కలేనన్ని అక్రమాలకు పాల్పడుతున్నట్టుగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అంబటి మైనింగ్ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ సొంత పార్టీ కార్యకర్తలే హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ వ్యవహారం విచారణ దశలోనే ఉండగానే మరో రెండు వివాదాలు అంబటిని చుట్టుకున్నాయి. అంబటి అండతో సత్తెనపల్లిలో పెద్ద ఎత్తున భూ అక్రమణలు జరుగుతున్నాయని ప్రజలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. అంబటికి అత్యంత సన్నిహితుడైన చోటా నేత రెండెకరాల 60 సెంట్ల భూ కబ్జాకు పాల్పడిన వ్యవహారం కేసుల వరకూ వెళ్లింది. మరో భూ కబ్జా కేసు వ్యవహారంలో ఫోర్జరీ సంతకాలతో తప్పుడు పత్రాలు సృష్టించి నాగోల్ మీరా అనే అంబటి అనుచరుడు భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. 

Advertisement
Advertisement
Advertisement