Abn logo
Jul 30 2021 @ 16:36PM

సీపీఎం నేతలను తొక్కుకుంటూ వెళ్లిన ఎమ్మెల్యే అంబటి

గుంటూరు జిల్లా: సత్తెనపల్లిలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీరు వివాదాస్పదమవుతోంది. ఆస్తి, చెత్తపన్ను పెంపుకు నిరసనగా మున్సిపల్ ఆఫీసు మెట్లకు అడ్డంగా బైఠాయించి సీపీఎం నేతలు  ధర్నాకు దిగారు. నిరసన తెలుపుతున్న సీపీఎం నేతలను తొక్కుకుంటూ అంబటి రాంబాబు కౌన్సిల్ హాల్లోకి వెళ్లిపోయారు. దీంతో అంబటి రాంబాబు తీరుపై సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ధర్నాకు దిగిన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.