Advertisement
Advertisement
Abn logo
Advertisement

అంబరాన్నంటిన అంబాభవాని ఉత్సవాలు

పూజలు చేసిన ఎమ్మెల్యే రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే బాలునాయక్‌ 

నేరేడుగొమ్ము/ నల్లగొండ కల్చరల్‌/ నల్లగొండ క్రైం/ కనగల్‌/ కట్టంగూర్‌,  అక్టోబరు 14: నేరేడుగొమ్ము మండలం పెద్దమునిగల్‌లో గిరిజనుల ఆరాధ్యదైవమైన అంబాభవాని దసరా ఉత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించారు. కోరిన కోర్కెలు నెరవేర్చేదైవంగా గిరిజనులు అంబాభవానిని పూజిస్తారు.  దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌, మాజీ ఎమ్మెల్యే బాలునాయక్‌లు వేరువేరుగా దేవాలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నల్లగొండ, మహాబూబ్‌నగర్‌, గుంటూరు, హైదరాబాద్‌, నాగార్జునసాగర్‌ ప్రాంతాల నుంచి భక్తులు వాహనాలు, మరబోట్లలో తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులుకలుగకుండా ఆలయకమిటీ నిర్వాహకులు జీవన్‌ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఏర్పా ట్లు చేశారు. డిండి సీఐ వెంకటేశ్వర్లు, నేరేడుగొమ్ము ఎస్‌ఐ సతీష్‌ ఆధ్వర్యంలో పోలీ్‌సబందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో నేరేడుగొమ్ము ఎంపీపీ పద్మ హనుమానాయక్‌, జడ్పీటీసీ కేతావత్‌ బాలు, వైస్‌ ఎంపీపీ ఆరెకంటి ముత్యాలమ్మ రాములు, సింగిల్‌విండో చైర్మన్‌ ముక్కమళ్ల చిన్న బాలయ్య, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు లోకసాని తిరుపతయ్య, ముత్యాల సర్వయ్య, సర్పంచ్‌ పంబాల అంజయ్య, కాంగ్రెస్‌ నాయకులు లోకసాని కృష్ణ, వెంకటయ్యగౌడ్‌ పాల్గొన్నారు. కాగా దేవీ నవరాత్రి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. నల్లగొండలోని పలు మండపాల్లో అమ్మవారిని భక్తులు మహిషాసు మర్థినిగా అలంకరించి భక్తితో పూజించారు. అమ్మవారి మండపాలన్నీ పూజలతో సందడి చేశాయి. రాక్షసున్ని సంహరించి గెలుపొందడంతో భక్తులు విజయోత్సవ వేడుకలను శుక్రవారం నిర్వహించుకోనున్నారు.   కాగా ఎన్జీ కళాశాలలో సాయంత్రం 6.15వాసవీక్లబ్స్‌ ఇంటర్నేషనల్‌, ఎల్వీ సేవావేదిక ఆధ్వర్యంలో శమీ వృక్ష పూజ, రావణాసుర వధ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ప్రోగ్రాం చైర్మన్‌ ఎల్వీ కుమార్‌, సిల్వర్‌క్లబ్‌ సభ్యులు జగిని పద్మాకర్‌, చైర్మన్‌ రేపాల భద్రాద్రి తెలిపారు. నల్లగొండ పట్టణవాసులు ఈ వేడుకకు హాజరుకావాలని వారు కోరారు. విజయ దశమి పండుగ జిల్లా ప్రజలకు అన్ని రంగాల్లో విజయం చేకూర్చి జిల్లా అన్ని రంగాల్లో అగ్రభాగంలో ఉండాలని జిల్లా ఎస్పీ ఏవీ. రంగనాథ్‌ అన్నారు పోలీస్‌ కార్యాలయంలోని ఏఆర్‌, ఎంటీ విభాగం వద్ద ఆయన సతీమణి లావణ్యతో కలిసి ఆయుధ, వాహన పూజలో పాల్గొన్నారు.  చిట్యాల కనకదుర్గ ఆలయంలో అమ్మవారికి రఽథోత్సవం  నిర్వహించారు.  కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మార్కెట్‌ చైర్మన్‌ జడల ఆదిమల్లయ్య, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కూరెల్ల లింగస్వామి, ఆలయ కమీటీ చైర్మన్‌ వేలుపల్లి మధుకుమార్‌, మేనేజర్‌ అంబటి నాగిరెడ్డి పాల్గొన్నారు. కట్టంగూర్‌ మండలంలోని పందెనపల్లిలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దైద రవీందర్‌ ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement