మృతదేహం కోసం ఆరుగురిని కిడ్నాప్ చేసిన గిరిజనులు!

ABN , First Publish Date - 2020-07-06T03:24:18+05:30 IST

తమ నాయకుడి మృత దేహాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ.. గిరిజనులు ఆరుగురు వ్యక్తులను కిడ్నాప్ చేసిన ఘటన ఈక్వెడార్‌లో చోటుచేసుకుం

మృతదేహం కోసం ఆరుగురిని కిడ్నాప్ చేసిన గిరిజనులు!

న్యూఢిల్లీ: తమ నాయకుడి మృత దేహాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ.. గిరిజనులు ఆరుగురు వ్యక్తులను కిడ్నాప్ చేసిన ఘటన ఈక్వెడార్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈక్వెడార్‌లోని అమెజాన్ తెగకు చెందిన నాయకుడికి ఇటీవల కరోనా వైరస్ సోకి, మరణించాడు. దీంతో అతని మృతదేహాన్ని అధికారులు ఖననం చేశారు. ఈ నేపథ్యంలో తమ నాయకుడి మృత దేహాన్ని తమకే అప్పగించాలని డిమాండ్ చేస్తూ.. పెరువియన్ సరిహద్దు సమీపంలోని కుమయ్ గ్రామ గిరిజనులు ఇద్దరు పోలీసు అధికారులను, ఇద్దరు సైనికులతో పాటు సాధారణ ప్రజలను గురువారం కిడ్నాప్ చేశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం వారితో చర్చలు జరిపింది. అంతేకాకుండా వారి నాయకుడి మృతదేహాన్ని వెలికితీసి గిరిజనులకు అప్పగించింది. దీంతో ఆ గిరిజనులు కిడ్నాప్ చేసిన వారిని ఆదివారం రోజు వదిలేశారు. ఈ విషయాన్ని ఈక్వెడార్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా బంధీ నుంచి విడుదైలన వారికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఈక్వెడార్‌లో ఇప్పటి వరకు 61వేల కరోనా కేసులు నమోదవ్వగా.. 4,800 మంది మరణించారు.


Updated Date - 2020-07-06T03:24:18+05:30 IST