Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 27 Apr 2022 16:13:59 IST

Amazon Summer Sale వచ్చేస్తోంది.. ఆఫర్ల పండగే.. ఏవేవి తగ్గనున్నాయంటే..

twitter-iconwatsapp-iconfb-icon
Amazon Summer Sale వచ్చేస్తోంది.. ఆఫర్ల పండగే.. ఏవేవి తగ్గనున్నాయంటే..

ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన Amazon సంస్థ Summer Sale అంటూ ఆఫర్లను ప్రకటించింది. ఈ Sale ఏ తేదీ నుంచి అనే విషయాన్నే ప్రకటించనప్పటికీ త్వరలో ఈ Amazon Summer Sale వినియోగదారుల కోసం తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ సేల్‌లో భాగంగా పలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. మొబైల్స్, మొబైల్ సంబంధిత ఉత్పత్తుల ధరల్లో 40 శాతం వరకూ తగ్గింపు ఉంటుందని Amazon తెలిపింది. ల్యాప్‌టాప్స్‌పై 30 శాతం డిస్కౌంట్స్‌ను ప్రకటించింది.


హెడ్‌ఫోన్స్‌ కొనాలని చూస్తున్న వారు ఈ Amazon Summer Saleలో భారీ తగ్గింపుతో వాటిని సొంతం చేసుకోవచ్చు. Amazon Summer Saleలో హెడ్‌ఫోన్స్‌‌పై 75 శాతం వరకూ డిస్కౌంట్స్ ప్రకటించనున్నట్లు Amazon పేర్కొంది. స్పీకర్స్‌పై 65 శాతం వరకూ, కెమెరా, కెమెరా సంబంధిత ఉత్పత్తులపై 70 శాతం వరకూ Amazon Summer Saleలో డిస్కౌంట్స్ ప్రకటించారు. స్మార్ట్‌ఫోన్స్‌లో Redmi Note 11T 5G, Xiaomi 11T Pro, Samsung Galaxy M33 5G, iQoo Z6 5G, OnePlus Nord CE 2 5G ఫోన్ల ధరలు తగ్గనున్నట్లు Amazon ప్రకటించింది.


టీవీలు, ఫ్రిజ్‌లపై 50 శాతం వరకూ ధరలను తగ్గిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. ప్రీ బుక్ చేసుకున్న వారికి మరిన్ని ఆఫర్లు ప్రకటించనున్నట్లు పేర్కొంది. అంతేకాదు.. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లలో భాగంగా రూ.15 వేల వరకూ తగ్గింపు పొందవచ్చని అమెజాన్ ప్రకటించింది. పలు బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్ లభించనుంది. ICICI, Kotak Mahindra, RBL బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసేవారికి 10 శాతం వరకూ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు అమెజాన్ తెలిపింది. Amazon Summer Sale అయితే ప్రకటించింది గానీ ఎప్పటి నుంచి ఈ సేల్ మొదలవుతుందో ఇప్పటికైతే చెప్పలేదు. త్వరలో తేదీని ప్రకటించే అవకాశముంది. Flipkart కూడా రేపోమాపో Summer Sale ప్రకటించే అవకాశాలు లేకపోలేదు. వేసవిలో ఎక్కువగా కొనుగోలు చేసే ఏసీలు, కూలర్లపై ఇప్పటికే ఈ రెండు దిగ్గజ ఈ-కామర్స్ సంస్థలు ఆఫర్లను ప్రకటించాయి.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

బిజినెస్Latest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.