పనిచేస్తున్న సంస్థకే టోకరా

ABN , First Publish Date - 2020-02-20T05:47:28+05:30 IST

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోని అమెజాన్‌ కంపెనీలో పనిచేసే ముగ్గురు ఉద్యోగులు కంపెనీని మోసగించి లక్షలాది రూపాయల విలువగల వస్తువులను దోచుకున్నారు.

పనిచేస్తున్న సంస్థకే టోకరా

శంషాబాద్‌:  శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోని అమెజాన్‌ కంపెనీలో పనిచేసే ముగ్గురు ఉద్యోగులు కంపెనీని మోసగించి లక్షలాది రూపాయల విలువగల వస్తువులను దోచుకున్నారు. నిందితులను పోలీసులు చాకచక్యంగా పట్టుకొని రూ.10 లక్షలు విలువచేసే           లాప్‌టా్‌పలు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ అశోక్‌కుమార్‌గౌడ్‌ వివరాలను వెల్లడించారు. మహేశ్వరం మండలం కోళ్లపడకల్‌ గ్రామానికి చెందిన హన్మగల్ల సాయికుమార్‌, మేడ్చల్‌ జిల్లా బోడుప్పల్‌ గాయత్రినగర్‌కు చెందిన సాగిలి కల్యాణ్‌, మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ధర్మారావుపేటకు చెందిన చీమలరాజులు గత ఏడాదిన్నర కాలంగా ఎయిర్‌పోర్టులోని అమెజాన్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అమెజాన్‌ కంపెనీలో ఆన్‌లైన్‌లో సరుకులు బుక్‌ చేసుకున్న కస్టమర్ల అడ్ర్‌సలు సేకరించేవారు. కస్టమర్ల పేరుతో చవకా ఉన్న వస్తువులను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే వారు. బిల్లింగ్‌,ప్యాకింగ్‌, డిస్‌ప్యాచ్‌ సెక్షన్లలో పనిచేసే ఈ ముగ్గురు నిందితులు వ్యాస్‌లెన్‌, బాడీ క్రీం, బాడీ లోషన్‌ వంటి చవకైన వస్తువులను ఆన్‌లైన్‌లో కస్టమర్ల అడ్ర్‌సతో బుక్‌చేసి వాటి స్థానంలో విలువైన లాప్‌టాప్‌, మొబైల్‌ ఫోన్లు పార్సల్‌చేసి బయటకు పంపేవారు. ఆ తరువాత అడ్రస్సుకు ముందే చేరుకొని ఆ వస్తువులను సేకరించేవారు. అయితే కంపెనీలో ఉండవలసిన స్టాక్‌ సరిగా లేకపోవడంతో అనుమానం వచ్చిన ఉన్నత స్థాయి సిబ్బంది సీసీ పుటేజ్‌ చెక్‌ చేయడంతో నిందితుల బండారం బయటపడింది. దీంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకొని విచారించారు. వారు దొంగిలించిన లాప్‌టా్‌పలు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులు మరిన్నీ కోణాల్లో దర్యాప్తు చేయడానికి నిందితులను పోలీసు కస్టడీ ఇవ్వాలని కోరుతున్నట్టు ఏసీపీ తెలిపారు. 

Updated Date - 2020-02-20T05:47:28+05:30 IST