టిక్ టాక్ యాప్ నిషేధించడంలో అమెజాన్ వెనకడుగు

ABN , First Publish Date - 2020-07-11T13:17:17+05:30 IST

టిక్ టాక్ యాప్ నిషేధించడంలో అమెరికా ఈ కామర్స్ దిగ్జజ సంస్థ అమెజాన్ వెనకడుగు వేసింది.....

టిక్ టాక్ యాప్ నిషేధించడంలో అమెజాన్ వెనకడుగు

సీటెల్ (అమెరికా) : టిక్ టాక్ యాప్ నిషేధించడంలో అమెరికా ఈ కామర్స్ దిగ్జజ సంస్థ అమెజాన్ వెనకడుగు వేసింది. టిక్ టాక్ యాప్‌ను ఫోన్ల నుంచి తొలగించాలని కోరుతూ ఉద్యోగులకు ఈ మెయిల్ పంపిన అమెజాన్ ఐదు గంటల్లోనే దాన్ని ఉపసంహరించుకుంది. టిక్ టాక్ పై నిషేధం విధించడం తమ పొరపాటుగా అమెజాన్ పేర్కొంది. ‘‘ఈ ఉదయం మా ఉద్యోగుల్లో కొంతమందికి ఈమెయిల్ తప్పుగా పంపించాం. టిక్‌టాక్‌కు సంబంధించి ప్రస్తుతం మా విధానాల్లో ఎటువంటి మార్పు లేదు’’ అని అమెజాన్ విలేకరులకు ఈమెయిల్ పంపింది. టిక్ టాక్ పునరుద్ధరణ విషయంలో ఏం జరిగిందనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి అమెజాన్ ప్రతినిధి జాకీ అండర్సన్ నిరాకరించారు.ఆన్‌లైన్‌లో విస్తృతంగా ప్రచారం అయిన అంతర్గత ఈమెయిల్ లో యువకుల్లో బాగా ప్రాచుర్యం పొందిన వీడియో అనువర్తనం టిక్‌టాక్‌ను తొలగించమని ఉద్యోగులకు అమెజాన్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 8.4 లక్షలమంది ఉద్యోగులతో అతిపెద్ద ప్రైవేటు సంస్థ అయిన అమెజాన్ టిక్ టాక్ కు వ్యతిరేకంగా వెళ్లడంపై ఒత్తిడి పెరిగిందని భావిస్తున్నారు.  

Updated Date - 2020-07-11T13:17:17+05:30 IST