మరింత స్మార్ట్‌గా అమెజాన్‌ అలెక్సా

ABN , First Publish Date - 2020-11-14T05:30:00+05:30 IST

అమెజాన్‌ అలెక్సా మరింత స్మార్ట్‌గా తయారవుతోంది. ప్రశ్నలకు సమాధానం చెప్పడమేకాదు, తరువాత

మరింత స్మార్ట్‌గా అమెజాన్‌ అలెక్సా

అమెజాన్‌ అలెక్సా మరింత స్మార్ట్‌గా తయారవుతోంది. ప్రశ్నలకు సమాధానం చెప్పడమేకాదు, తరువాత ఏమి ప్రశ్నఅడగబోతున్నారు, దాని సమాధానం ఏమిటి అన్నది కూడా ఊహించేలా దీనిని రూపొందిస్తున్నారు.  మెషీన్‌ లెర్నింగ్‌ సిస్టమ్‌ను ఇందుకోసం ఉపయోగిస్తోంది. ఉదాహరణకు ఒక కేక్‌ ఎలా తయారు చేయాలో చెబుతూ, ఎంత టైమ్‌ పడుతుందో వివరించి,     ఆ వెంటనే తయారీకి టైమ్‌ సెట్‌ చేయమంటారా అని అడుగుతుంది. మొదటి ప్రశ్నకు అనుసంధానంగా వచ్చే రెండో దానిపై దృష్టి పెట్టడం ఇందులోని లాజిక్‌.


ఒక డైలాగ్‌లోని వివిఽధ కోణాలను అవగాహన చేసుకునేందుకు డీప్‌ లెర్నింగ్‌ ట్రిగ్గర్‌ మోడల్‌ని ఉపయోగిస్తోంది. అలాగే సెమింటిక్‌-రోల్‌ లేబిలింగ్‌ మోడల్‌తో సరిగ్గా తరవాత ప్రశ్నను ఊహించే ప్రయత్నం చేస్తోంది.  అదేవిధంగా బండిట్‌ లెర్నింగ్‌తో ఇస్తున్న సూచనలు వినియోగదారుడికి ఉపయోగపడుతున్నాయా లేదా అన్నది చెక్‌ చేసుకుంటుంది.  మొత్తమ్మీద ఈ సిస్టమ్‌ అర్థవంతంగా పనిచూసేలా చూస్తోంది. ఈ అలెక్సా ఫీచర్‌ ఇప్పటికే అమెరికాలో అందుబాటులో ఉంది. 


Updated Date - 2020-11-14T05:30:00+05:30 IST