Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 07 Jan 2022 15:37:10 IST

‘‘ పుష్ప’’ ఓటీటీ డీల్‌కు అమెజాన్ ప్రైమ్ ఎంత చెల్లించిందంటే..?

twitter-iconwatsapp-iconfb-icon

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘‘ పుష్ప’’. లెక్కల మాస్టారు సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం జనవరి 7న రాత్రి 8గంటల నుంచి స్ట్రీమ్ కానుంది. ఈ చిత్ర స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ కోట్లు చెల్లించి సొంతం చేసుకుందని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.  


ఓటీటీ దిగ్గజమైన అమెజాన్ ప్రైమ్ దాదాపుగా రూ. 27కోట్ల నుంచి రూ.30కోట్లకు ఈ సినిమా హక్కులను సొంతం చేసుకుందని తెలుస్తోంది. ‘‘ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ హక్కులకు అంత కంటే ఎక్కవ ధరే లభించింది. అమెజాన్‌లో ఈ సినిమా 4 భాషల్లో (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ) అందుబాటులో ఉంటుంది ’’ అని టాలీవుడ్‌కు సంబంధించిన వ్యక్తి చెప్పారు. ‘‘ పుష్ప’’ డిసెంబర్ 17, 2021న థియేటర్లల్లో విడుదల అయింది. సినిమా విడుదలయిన 21రోజుల్లకే ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమ్ కాబోతుండటం విశేషం. ఈ సినిమాలో రష్మిక మందన్న, సునీల్, ఫహద్ ఫాజిల్, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement