Amazon Prime కు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లి వీడియో హక్కులు.. అన్ని కోట్లా..!?

బాలీవుడ్ సెలెబ్రిటీ లవ్‌బర్డ్స్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ డిసెంబరు 9న పెళ్లి చేసుకొబోతున్నారు. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఆఫ్ ఫోర్ట్ బర్వరాలో వీరి వివాహం జరగనుంది. ఈ వేడుకలకు దాదాపుగా 120మంది అతిథులుగా రాబోతున్నట్టు మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పీఎమ్‌వో నుంచి కూడా 5గురు అధికారులు రాబోతున్నట్టు సమాచారం. 


సెల్‌ఫోన్‌లను తీసుకురావొద్దని ఈ వేడుకలకి హాజరుకాబోయే అతిథులకి విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ సూచిస్తున్నారు. పెళ్లికి సంబంధించిన ఫొటోలు తమ ప్రమేయం లేకుండా సోషల్ మీడియాలో లీక్ కావొద్దని వారు భావిస్తున్నారు. అందుకు బలమైన కారణం ఉందని బీ టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ జంట తమ వెడ్డింగ్ టెలికాస్ట్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్‌కి భారీ ధరకు అమ్మేసినట్టు మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. దాదాపుగా రూ.80కోట్లు వెచ్చించి ఈ పెళ్లి టెలికాస్ట్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుందని తెలుస్తోంది. విదేశాల్లో ఈ విధంగా హక్కులను అమ్మేయడం అనేది చాలా సర్వసాధారణమైన విషయం. కత్రినా కైఫ్ పెళ్లితో ఈ సంప్రదాయం భారత్‌కు కూడా పాకిందని అర్థమవుతోంది. 


‘‘ విదేశాల్లో ఈ సంప్రదాయం చాలా కాలంగా కొనసాగుతోంది. అమెజాన్‌ప్రైమ్ ఈ సంప్రదాయాన్ని భారత్‌లో తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఫెళ్లికి సంబంధించిన ఫొటోలు, టెలికాస్ట్ రైట్స్ అన్నింటికి కలిపి దాదాపుగా రూ. 100కోట్ల వరకు ఆఫర్ చేశారు. ఈ ఆఫర్‌కు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ అంగీకరించొచ్చు లేదా తిరస్కరించొచ్చు ’’ అని ఈ విషయంతో సంబంధం ఉన్న వ్యక్తులు చెబుతున్నారు.

Advertisement

Bollywoodమరిన్ని...