Amazon: అమెజాన్ కూడా మొదలుపెట్టేసిందిగా.. వెబ్‌సైట్‌లో కాదు నేరుగానే దుకాణం తెరిచి..

ABN , First Publish Date - 2022-05-28T21:57:56+05:30 IST

ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన Amazon.com వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టింది. కొత్తగా అడుగు పెట్టడం ఏంటి.. ఇప్పటికే అమెజాన్‌ వెబ్‌సైట్‌లో..

Amazon: అమెజాన్ కూడా మొదలుపెట్టేసిందిగా.. వెబ్‌సైట్‌లో కాదు నేరుగానే దుకాణం తెరిచి..

ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన Amazon.com వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టింది. కొత్తగా అడుగు పెట్టడం ఏంటి.. ఇప్పటికే అమెజాన్‌ వెబ్‌సైట్‌లో దుస్తులు కూడా అమ్ముతున్నారు కదా అనే సందేహం రావొచ్చు. ఇప్పుడు అమెజాన్ అమ్మే దుస్తులు నేరుగా క్లాత్ స్టోర్‌కు వెళ్లి కూడా కొనుగోలు చేయవచ్చు. ‘Amazon Style’ పేరుతో అమెజాన్ సంస్థ వస్త్ర దుకాణం తెరిచింది. తొలుత కాలిఫోర్నియాలోని లాస్‌ ఏంజెల్స్ నగరానికి సమీపంలోని గ్లెన్డేల్ ప్రాంతంలో ‘Amazon Style’ క్లాత్ స్టోర్‌ను అమెజాన్ ప్రారంభించింది. అమెజాన్ వెబ్‌సైట్‌లో దుస్తులు అందుబాటులో ఉన్నప్పటికీ పరిమిత బ్రాండ్స్ మాత్రమే ఉన్నాయి. ఎక్కువగా బ్రాండెడ్ T-Shirts వంటివి మాత్రమే అమెజాన్ వెబ్‌సైట్‌లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ.. ఈ ‘Amazon Style’ లో అలా కాదు. Lacoste, Levi’s, Steve Madden, Tommy Hilfiger, Champion బ్రాండ్స్ దుస్తులు కూడా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.



అమెజాన్ ప్రారంభించిన ఈ ‘అమెజాన్ స్టైల్’ క్లాత్ స్టోర్ ఆ సంస్థ యొక్క మొట్టమొదటి ఫిజికల్ క్లాత్ స్టోర్ (First-Ever Physical Apparel Store) కావడం విశేషం. ‘Amazon Style’ను అత్యంత అధునాతన టెక్నాలజీతో నిర్మించారు. నచ్చిన దుస్తులు అన్నింటినీ ఫిట్టింగ్ రూమ్ వరకూ మోసుకుని వెళ్లే పనిలేకుండా QR కోడ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆ QR Codeను స్కాన్ చేస్తే నేరుగా ఫిట్టింగ్ రూంకు కావాలంటే ఫిట్టింగ్ రూంకు లేదా Purchase Counter దగ్గరకు దుస్తులే వచ్చే విధంగా అమెజాన్ స్టైల్‌లో సదుపాయం ఉంది. అంతేకాదు.. Amazon.comలో దుస్తులు కొనుగోలు చేసిన వారు ఆ దుస్తులు సరిపడకపోతే ‘Amazon Style’ క్లాత్ స్టోర్‌లో రిటర్న్ చేసే వెసులుబాటు కూడా ఉంది.



ప్రతీ ఫిట్టింగ్ రూంలో టచ్‌‌స్క్రీన్ మానిటర్ కూడా ఉంటుంది. మరిన్ని దుస్తులు ట్రై చేసేందుకు లేదా ట్రై చేసిన దుస్తుల ధర మొత్తం ఎంతో తెలుసుకునేందుకు ఈ టచ్‌‌స్క్రీన్ మానిటర్‌ను అందుబాటులోకి తెచ్చారు. బిల్లు చెల్లించేటప్పుడు కూడా అమెజాన్ అకౌంట్ ద్వారా పే చేసే అవకాశం కూడా ఈ అమెజాన్ స్టైల్‌లో ఉంది. అమెజాన్ వెబ్‌సైట్ 24/7 అందుబాటులో ఉంటుంది. కానీ.. ఈ Amazon Style మాత్రం సోమవారం నుంచి గురువారం వరకూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ తెరిచి ఉంటుంది. శుక్ర, శని వారాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ తెరిచి ఉంటుంది. ఆదివారం రోజు కూడా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ Amazon Style క్లాత్ స్టోర్ కార్యకలాపాలు కొనసాగుతాయని అమెజాన్ తెలిపింది.

Updated Date - 2022-05-28T21:57:56+05:30 IST