Abn logo
Sep 16 2020 @ 00:49AM

హైదరాబాద్‌లో అమెజాన్ ‌కొత్త ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాలు

హైదరాబాద్‌లో అమెజాన్‌ మరో రెండు కొత్త ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాలను (ఎఫ్‌సీ)  ప్రారంభించింది. హైదరాబాద్‌, తెలంగాణ, సమీప రాష్ట్రాల్లో కొనుగోలుదారులకు వేగంగా ఉత్పత్తులను డెలివరీ చేయడానికి, మరింత మంది విక్రయదారులు మరిన్ని ఉత్పత్తులను విక్రయించడానికి ఈ విస్తరణ దోహదం చేస్తుందని అమెజాన్‌ ఇండియా (ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్స్‌) డైరెక్టర్‌ ప్రకాశ్‌ కుమార్‌ దత్తా తెలిపారు.

కొత్తగా ఏర్పాటు చేసిన గోదాములతో మొత్తం 4 ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాల్లో 45 లక్షల ఘనపుటడుగుల స్టోరేజీ స్పేస్‌ అందుబాటులోకి వస్తుంది.  

Advertisement
Advertisement
Advertisement