స్కూల్ టీచర్‌ను పెళ్లి చేసుకున్న బెజోస్ మాజీ భార్య

ABN , First Publish Date - 2021-03-08T22:28:12+05:30 IST

ప్రపంచ కుబేరుడు, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకెన్‌జీ స్కాట్ ఓ స్కూల్ టీచర్‌ను వివాహం చేసుకుంది. బెజోస్‌తో ఉన్న 25 ఏళ్ల బంధానికి 2019లో స్వస్తి పలికిన మెకెన్‌జీ అప్పటి నుంచి ఒంటరిగానే..

స్కూల్ టీచర్‌ను పెళ్లి చేసుకున్న బెజోస్ మాజీ భార్య

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ కుబేరుడు, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకెన్‌జీ స్కాట్ ఓ స్కూల్ టీచర్‌ను వివాహం చేసుకుంది. బెజోస్‌తో ఉన్న 25 ఏళ్ల బంధానికి 2019లో స్వస్తి పలికిన మెకెన్‌జీ అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటోంది. అయితే తాజాగా డాన్ జివెట్ అనే స్కూల్ టీచర్‌ను పెళ్లి చేసుకుంది. మెకెన్‌జీ పిల్లలు చదువుతున్న స్కూల్‌లోనే జివెట్ సైన్స్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. అయితే వారిద్దరి పెళ్లి ఎన్ని రోజుల క్రితం అయింది..? లేదా ఎంతకాలంగా వారు కలిసి ఉంటున్నారు..? అనే విషయాలు మాత్రం ఇంకా తెలియాలేదు. శనివారం తమ వివాహానికి సంబంధించి అధికారికంగా ప్రకటించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాగా మెకెన్‌జీ వయసు ప్రస్తుతం 50 ఏళ్లు. ఆమె ఆస్తి విలువ దాదాపు 53 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో దాదాపు 4 లక్షల కోట్లు.


ఇదిలా ఉంటే మెకెన్‌జీ వివాహంపై బెజోస్ కూడా స్పందించాడు. జివెట్ చాలా మంచి వ్యక్తిని, వారిద్దరు ఒక్కటైనందుకు ఆనందంగా ఉందని బెజోస్ అన్నాడు. బెజోస్-మెకెన్‌జీలకు మొత్తం నలుగురు పిల్లలున్నారు. వారంతా ప్రస్తుతం మెకెన్‌జీతోనే ఉన్నరు. ఈ విషయాన్ని కూడా ఆమె తాజాగా వెల్లడించింది. ఆమెకు సంబంధించిన అమెజాన్ బయోగ్రఫీ పేజీలో ‘నా నలుగురు పిల్లలు, భర్తతో సీటెల్‌లో నివశిస్తున్నాను’ అని మార్చుకున్నారు.

Updated Date - 2021-03-08T22:28:12+05:30 IST