Advertisement
Advertisement
Abn logo
Advertisement

నెల రోజుల పండుగకు సిద్ధమైన Amazon

న్యూఢిల్లీ: ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ సేల్‌కు సిద్ధమైంది. అక్టోబరు 4వ తేదీ నుంచి సేల్ ప్రారంభమవుతుందని, నెల పొడవునా కొనసాగుతుందని నేడు వర్చువల్‌గా జరిగిన మీడియా సమావేశంలో అమెజాన్ వెల్లడించింది. సేల్ ప్రారంభానికి ముందే ప్రైమ్ మెంబర్లకు డీల్స్, డిస్కౌంట్లు లభిస్తాయని పేర్కొంది. కాగా, అమెజాన్ ప్రత్యర్థి ఫ్లిప్‌కార్ట్ కూడా అక్టోబరు 7 నుంచి బిగ్‌బిలియన్ డేస్ సేల్‌కు సిద్ధం కావడం గమనార్హం. 


గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా వినియోగదారులను ఆకట్టుకునేందుకు మొబైల్స్, యాక్సెసరీస్, స్మార్ట్‌వాచ్, ట్యాబ్లెట్స్, ల్యాప్‌టాప్స్, స్మార్ట్ టీవీ వంటి హోం అప్లయెన్సెస్‌పై భారీ రాయితీలు ప్రకటించింది. అలాగే, అమెజాన్ ఎకో, ఫైర్ టీవీ, కిండ్లే డివైజ్‌లు అతి తక్కువ ధరకే లభిస్తాయని పేర్కొంది. యాపిల్, ఆసుస్, ఫాజిల్, హెచ్‌పీ, లెనోవో, వన్‌ప్లస్, శాంసంగ్, సోనీ, షియోమీ వంటి 1000కిపై బ్రాండ్స్ నుంచి కొత్త ఉత్పత్తులు లాంచ్ అవుతాయని, వాటిపైనా డీల్స్, డిస్కౌంట్లు, ఆఫర్లు లభిస్తాయని అమెజాన్ తెలిపింది. 


అమెజాన్ పే ద్వారా ఫెస్టివల్ సేల్ ఉత్పత్తుల కొనుగోలుపై జరిపే లావాదేవీలు, యుటిలిటీ బిల్స్, టికెట్ల బుకింగ్‌లు, నగదు బదిలీ చేయడం ద్వారా రూ. 5 వేల వరకు ఆదా చేసుకోవచ్చని వివరించింది.  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డుతో చేసే కొనుగోళ్లు, ఈఎంఐ లావాదేవీలపై తక్షణం 10శాతం రాయితీ లభిస్తుందని పేర్కొంది. 

Advertisement
Advertisement