Amazon Flipkart Sales: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసేవారికి పండగేగా.. ఆఫర్లేంటో.. ఏమేం తక్కువకు వస్తున్నాయో చూడండి..

ABN , First Publish Date - 2022-08-05T01:53:25+05:30 IST

ఆగస్ట్ వచ్చిందంటే చాలు. ఈ-కామర్స్ కంపెనీలు independence day సేల్స్ పేరుతో ఆఫర్లకు, డిస్కౌంట్లకు తెర లేపుతుంటాయి. ఈ సంవత్సరం కూడా..

Amazon Flipkart Sales: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసేవారికి పండగేగా.. ఆఫర్లేంటో.. ఏమేం తక్కువకు వస్తున్నాయో చూడండి..

ఆగస్ట్ వచ్చిందంటే చాలు. ఈ-కామర్స్ కంపెనీలు independence day సేల్స్ పేరుతో ఆఫర్లకు, డిస్కౌంట్లకు తెర లేపుతుంటాయి. ఈ సంవత్సరం కూడా ఈ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సరికొత్త సేల్స్‌ మొదలుపెట్టాయి. అమెజాన్ సంస్థ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2022 (Amazon Great Freedom Festival 2022) పేరుతో ఆఫర్లను ప్రకటించింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్ట్ 6 నుంచి ఆగస్ట్ 10 వరకూ ఈ ‘గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్’ నిర్వహిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. ప్రైమ్ మెంబర్లకు ఒకరోజు ముందుగానే అంటే.. ఆగస్ట్ 5 నుంచే ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి.



ఈ సేల్‌లో భాగంగా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను 2 వేల వరకూ పొందే అవకాశం కల్పిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. ఈ సేల్‌లో భాగంగా అమ్మే కొన్ని వస్తువులపై ముందుగానే Kickstarter Early Deals పేరుతో ఆఫర్లను అమెజాన్ ఇప్పటికే అందుబాటులో ఉంచింది. కేవలం ఒక్క రూపాయి మాత్రమే చెల్లించి ప్రీ-బుక్ చేసుకునే అవకాశం కూడా కల్పించింది. ఈ అమెజాన్ Great Freedom Festival లో భాగంగా.. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్, టీవీలు, ఆడియో డివైజ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు డిస్కౌంట్ ధరకే లభించనున్నాయి. Xiaomi, Poco, Samsung, Realme, Motorola, Google, Apple, Oppo కంపెనీల స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం వరకూ డిస్కౌంట్ దక్కనుంది.



ఈ సేల్‌లో భాగంగా OnePlus Nord 2T 5G స్మార్ట్‌ఫోన్ 28,999 రూపాయలకే వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. అంతేకాదు.. క్యాష్‌బ్యాక్ కూడా పొందే అవకాశం ఉంది. Redmi K50i 5G స్మార్ట్‌ఫోన్ కూడా 25,999 రూపాయలకు, Samsung Galaxy M53 5G 24,999 రూపాయలకే లభించనుంది. శామ్‌సంగ్ గెలాక్సీ ఎం53 5జీ స్మార్ట్‌ఫోన్ 26,499 రూపాయలు ఉండేది. ఈ సేల్‌లో 24,999కే రానుంది. 49 రూపాయల నుంచే Mobile accessories ఈ సేల్‌లో అందుబాటులో ఉండనున్నాయి. Boat AirDopes 181 wireless earbuds 1,299కే కొనుగోలు చేసే అవకాశం ఉంది. వన్‌ప్లస్ 50 అంగుళాల 4కే ఆండ్రాయిడ్ టీవీ 38,999 రూపాయలకు, లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 ల్యాప్‌టాప్ 32,990 రూపాయలకే అమెజాన్ సేల్‌లో అందుబాటులో ఉండనున్నాయి. గృహోపకరణ ఉత్పత్తులపై కూడా 60 శాతం వరకూ తగ్గింపును అమెజాన్ ప్రకటించింది. స్మార్ట్‌టీవీలపై 50 శాతం డిస్కౌంట్‌ అప్లై కానుంది. ఎక్స్‌ఛేంజ్, క్యాష్‌బ్యాక్, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే.. ఈ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయాలని భావిస్తున్న వారికి సదవకాశమని చెప్పొచ్చు.



ఇక.. మరో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కూడా ఆగస్ట్ 6 నుంచి Big Saving Days పేరుతో సేల్ నిర్వహిస్తోంది. ఆగస్ట్ 6 నుంచి ఆగస్ట్ 10 వరకూ ఈ సేల్ అందుబాటులో ఉండనుంది. ఈ సేల్‌లో భాగంగా ఐసీఐసీఐ, కొటక్ బ్యాంకు కార్డులపై 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. టీవీలు, అప్లియన్సెస్‌పై 75 శాతం వరకూ డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. Samsung, Realme, Xiaomi కంపెనీల టీవీలతో పాటు పలు బ్రాండ్స్ టీవీలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఏసీలపై 55 శాతం డిస్కౌంట్, మైక్రోవేవ్స్‌పై 45 శాతం డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రతి సేల్‌లో లాగానే ఈ సేల్‌లో కూడా 12AM, 8AM and 4PM కు క్రేజీ డీల్స్ అందుబాటులో ఉండనున్నాయి. Rush hours పేరుతో 2AM కు భారీ డిస్కౌంట్స్ కూడా పొందే వీలుంది. మొత్తంగా ఆన్‌లైన్ షాపింగ్ చేయాలనుకునే వారు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తాజా సేల్స్‌పై ఓ లుక్కేయొచ్చు.

Updated Date - 2022-08-05T01:53:25+05:30 IST