Amazon Special Offer: నాలుగు గంటల్లోనే డెలివరీ!

ABN , First Publish Date - 2022-09-27T03:16:36+05:30 IST

అమెజాన్ ఇండియా (Amzaon India) తమ ప్రైమ్ డే సభ్యులకు గొప్ప శుభవార్త చెప్పింది. దేశంలోని 50కిపైగా నగరాలు

Amazon Special Offer: నాలుగు గంటల్లోనే డెలివరీ!

న్యూఢిల్లీ: అమెజాన్ ఇండియా (Amzaon India) తమ ప్రైమ్ డే సభ్యులకు గొప్ప శుభవార్త చెప్పింది. దేశంలోని 50కిపైగా నగరాలు, పట్టణాల్లోని తమ ప్రైమ్ సభ్యులకు ‘సేమ్ డే డెలివరీ’ (Same Day Delivery)ని ప్రకటించిన అమెజాన్.. ఇప్పుడు మరో ప్రకటన చేసింది. నాలుగు గంటల్లోపే డెలివరీ చేస్తామని ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే.. ఈసారి 2.5 రెట్లు ఎక్కువ పిన్‌కోడ్‌లలో సేమ్ డే డెలివరీ (Same Day Delivery)ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గతేడాది ఇది 14 నగరాల్లోనే అందుబాటులో ఉండగా, ఈ ఏడాది 50కిపైగా నగరాలు, పట్టణాలకు విస్తరించింది. అందులో సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్ కూడా ఉన్నాయి.


అమెజాన్ (Amazon) తొలుత 2017లో ఇండియాలో 2017లో సేమ్ డే డెలివరీని పరిచయం చేసింది. ఆ తర్వాత దీనిని మరిన్ని నగరాలకు విస్తరిస్తూ వస్తోంది. వేగవంతమైన డెలివరీని సాధ్యం చేసేందుకు  వ్యూహాత్మంగా అడుగులు వేస్తోంది. క్లిక్ టు డెలివరీ (Click To Delivery)కి అనుగుణంగా తమ కార్యాలయాలను అప్‌గ్రేడ్ చేసింది. వినియోగదారులకు కావలసిన ఉత్పత్తులను వేగంగా డెలివరీ చేసే ఉద్దేశంతో తక్కువ సేవలు అందుకుంటున్న మెట్రోల వెలుపల నగరాలు, పట్టణాల్లో పరిచయం చేసేందుకు ఉత్సాహంగా ఉన్నట్టు అమెజాన్ ఇండియా (Amazon India) కస్టమర్ ఫుల్‌ఫిల్‌మెంట్, సప్లై చైన్ అండ్ అమెజాన్  ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్ డైరెక్టర్ అభినవ్ సింగ్ తెలిపారు. 


అమెజాన్ ఇండియా (Amazon India) ఇప్పుడు సర్వీస్ చేయదగిన అన్ని పిన్‌కోడ్‌లకు డెలివరీ చేస్తుండగా,  97శాతం కన్నా ఎక్కువ పిన్‌కోడ్‌లకు ఇప్పుడు ఆర్డర్ చేసిన 2 రోజుల లోపలే డెలివరీలు చేస్తోంది. కంపెనీ ప్రైమ్ సభ్యులకు తన ఉచిత వన్‌డే, సేమ్ డే డెలివరీ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు పెట్టుబడులు కొనసాగిస్తోంది.  గత ఏడాదితో పోలిస్తే ఈసారి చాలా సేమ్ డే డెలివరీ సేవలు మరింత మెరుగయ్యాయి.  

Updated Date - 2022-09-27T03:16:36+05:30 IST