Abn logo
Apr 16 2021 @ 00:20AM

రూ.1,873 కోట్లతో అమెజాన్‌ సంభవ్‌ నిధి

న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరహా వ్యాపారాల డిజిటలై జేషన్‌ కోసం ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ 25 కోట్ల డాలర్ల (రూ.1,873 కోట్లు) నిధిని ప్రకటించింది. ఎంఎ్‌సఈలు కొత్త వ్యాపార బ్రాండ్‌ నిర్మాణానికి ఈ నిధి ఉత్తేజం కల్పిస్తుందని అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ సీఈఓ ఆండ్రూ జెస్సీ అన్నారు. 2025నాటికి ఎస్‌ఎంఈలు కోటి డాలర్ల ఎగుమతుల స్థాయిని చేరడానికి, 10 లక్షల అదనపు ఉద్యోగాలు కల్పించేందుకు సహాయపడడానికి వంద కోట్ల డాలర్లతో అమెజాన్‌ సంభవ్‌ నిధి ఏర్పాటు చేస్తామని గత ఏడాది జెఫ్‌ బెజోస్‌ ప్రకటించారు. ఇందులో భాగంగానే  ఈ వెంచర్‌ ఫండ్‌ ఏర్పాటు చేస్తున్నట్టు ఆండ్రూ చెప్పారు.  


Advertisement
Advertisement
Advertisement