Amazon డెలివరీ బాయ్ వైరల్ వీడియో.. అయ్యయ్యో వ్యాన్‌లో ఇదేం పని అంటున్న నెటిజన్లు..

ABN , First Publish Date - 2021-11-05T01:19:52+05:30 IST

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌కు చెందిన డెలివరీ బాయ్‌‌కి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు రెచ్చిపోతున్నారు. కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. దీంతో ఆ వీడియో కాస్తా అమెజాన్ దృష్టికి చేరింది. ఈ క్రమంలో సంస్థ ప్రతినిధులు సీరియస్

Amazon డెలివరీ బాయ్ వైరల్ వీడియో.. అయ్యయ్యో వ్యాన్‌లో ఇదేం పని అంటున్న నెటిజన్లు..

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌కు చెందిన డెలివరీ బాయ్‌‌కి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు రెచ్చిపోతున్నారు. కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. దీంతో ఆ వీడియో కాస్తా అమెజాన్ దృష్టికి చేరింది. ఈ క్రమంలో సంస్థ ప్రతినిధులు సీరియస్ అయ్యారు.  కాగా.. అమెజాన్ సంస్థ ప్రతినిధులు సీరియస్ అయ్యేటంత పని ఆ డెలివరీ బాయ్ ఏం చేశాడు. వారు ఎందుకు సీరియస్ అయ్యారు అనే పూర్తి వివరాల్లోకి వెళితే.. 



అమెజాన్ సంస్థ‌కు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరుంది. కోట్లాది మంది కస్టమర్లను కలిగి ఉంది. అప్పుడప్పుడు చిన్న పొరపాట్లు జరిగినప్పటికీ ప్రజలు మాత్రం ఈ సంస్థను విశ్వసిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఫ్లోరిడాలోని టెంపా ప్రాంతానికి చెందిన కొంత మంది అమెజాన్‌లో కొన్ని వస్తువులను ఆర్డర్ చేశారు. ఈ నేపథ్యంలో కస్టమర్‌లు ఆర్డర్ చేసిన వాటిని డెలివరీ చేయడానికి అమెజాన్‌కు చెందిన ఓ వ్యాన్ అక్కడకు చేరుకుంది. డెలివరీ వ్యాన్ రోడ్డు పక్కన పార్క్ చేసిన తర్వాత కొద్ది సేపటికే.. అందులోంచి నల్ల దుస్తులు ధరించిన ఓ మహిళ సిగ్గు పడుతూ ముసిముసి నవ్వులు నవ్వుతూ కిందకు దిగింది. అనంతరం వ్యాన్‌లోనే ఉన్న డెలివరీ బాయ్‌ను చూసుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోయింది. 



ఇది 2019 జులైలో చోటు చేసుకోగా.. అప్పట్లో ఆ దృశ్యాలను కొందరు వీడియో తీశారు. అయితే తాజాగా వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో రెచ్చిపోయిన కొందరు నెటిజన్లు.. ‘అమెజాన్ డెలివరీ వ్యాన్‌లో ఏం జరిగింది’ అని సందేహాలు వ్యక్తం చేస్తూ కామెంట్ చేశారు. దీంతో విషయం కాస్తా అమెజాన్ ప్రతినిధుల దృష్టికి వెళ్లింది. ఘటనపై అమెజాన్ ప్రతినిధులు సీరియస్ అయ్యారు. ఈ విషయంపై విచారణ చేపట్టారు. అంతేకాకుండా.. ‘మా డెలివరీ పార్ట్నర్లు, వారి డ్రైవర్లు సంస్థ ఉన్నత ప్రమాణాలకు లోబడి పని చేయాలి. అనధికారిక వ్యక్తునుల డెలివరీ వ్యాన్‌లోకి ఎక్కించడం మా పాలసీకి విరుద్ధం’ అని పేర్కొన్నారు. అంతేకాకుండా సదరు డెలివరీ బాయ్‌ని విధుల నుంచి తొలగించినట్లు స్పష్టం పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. అమెజాన్ డెలివరీ బాయ్‌కు సంబంధించిన వీడియోను ఇప్పటి వరకు 12 మిలియన్ల మంది వీక్షించారు. 





Updated Date - 2021-11-05T01:19:52+05:30 IST