అమెజాన్ ప్రైమ్ ఖాతాదారులకు చేదువార్త!

ABN , First Publish Date - 2021-05-16T21:58:37+05:30 IST

అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు ఇది చేదువార్తే. భారతీయ రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలను అనుసరించి

అమెజాన్ ప్రైమ్ ఖాతాదారులకు చేదువార్త!

న్యూఢిల్లీ: అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు ఇది చేదువార్తే.  భారతీయ రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలను అనుసరించి నెల వారీ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను తొలగించింది. దీంతో ఇప్పుడు మూడు నెలలు, ఏడాది ప్రీమియం మెంబర్‌షిప్ మాత్రమే అందుబాటులో ఉంది. రికరింగ్ ఆన్‌లైన్ లావాదేవీల కోసం అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ (ఏఎఫ్ఏ)ను అమలు చేయాలంటూ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను ఆర్బీఐ ఆదేశించింది. ఇందుకోసం ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు గడువిచ్చింది.


ఈ నేపథ్యంలో  నెలకు రూ. 129తో అందుబాటులో ఉన్న ప్రారంభ ప్యాక్‌ను అమెజాన్ తొలగించింది. అలాగే, ఫ్రీ ట్రయల్‌ను కూడా తీసేసింది. ఇకపై ఎవరైనా యూజర్ కొత్త ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాలన్నా, లేదంటే పాతదాన్ని రెన్యువల్ చేసుకోవాలన్నా అయితే మూడు నెలలు, లేదంటే ఏడాది సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అమెజాన్ మూడు నెలల ప్రైమ్ మెంబర్‌షిప్ కావాలంటే రూ. 329, ఏడాది సభ్యత్వం కోసం రూ.999 చెల్లించాల్సి ఉంటుంది. 

Updated Date - 2021-05-16T21:58:37+05:30 IST