కిశోర్‌ బియానీని అరెస్టు చేయాలి

ABN , First Publish Date - 2021-01-26T07:07:20+05:30 IST

రిలయన్స్‌-ఫ్యూచర్‌ రిటైల్‌ ఒప్పందాన్ని అడ్డుకునేందుకు అమెజాన్‌ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసింది

కిశోర్‌ బియానీని అరెస్టు చేయాలి

కుటుంబ ఆస్తులను జప్తు చేయాలి: అమెజాన్‌ 


న్యూఢిల్లీ: రిలయన్స్‌-ఫ్యూచర్‌ రిటైల్‌ ఒప్పందాన్ని అడ్డుకునేందుకు అమెజాన్‌ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసింది. వెంటనే ఈ ఒప్పందాన్ని ఆపడంతో పాటు ప్యూచర్‌ గ్రూప్‌ సీఈఓ కిశోర్‌ బియానీని అరెస్టు చేయాలని ఢిల్లీ హైకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. బియానీ, ఆయన కుమార్తె ఆష్నితో సహా ఫ్యూచర్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుల స్థిర, చరాస్తులను జప్తు చేయాలని కోరింది. వీరందరినీ అదుపులోకి తీసుకుని జైల్లో పెట్టేందుకూ ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరింది. దీంతో ఈ కేసును న్యాయస్థానంలోనే తేల్చుకుంటామని ఫ్యూచర్‌ గ్రూప్‌ ప్రకటించింది. 

Updated Date - 2021-01-26T07:07:20+05:30 IST