Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 12 Jan 2022 11:47:54 IST

అందంగా లేనని ఆ సినిమాలో అవకాశం ఇవ్వలేదు: అమేజింగ్ స్పైడర్ మ్యాన్

twitter-iconwatsapp-iconfb-icon
అందంగా లేనని ఆ సినిమాలో అవకాశం ఇవ్వలేదు: అమేజింగ్ స్పైడర్ మ్యాన్

‘ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్’ సిరీస్ సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుపొందిన నటుడు ఆండ్ర్యూ గార్‌ఫీల్డ్. ఇటీవలే వచ్చిన మార్వెల్ మూవీ ‘నో వే హోమ్’తో మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈ తరుణంలో ఓ ఇంటర్వ్యూలో గత అనుభవాలను కొన్నింటి పంచుకున్నాడీ హలీవుడ్ స్టార్.


గార్‌ఫీల్డ్ మాట్లాడుతూ.. ‘ది క్రోనికల్స్ ఆఫ్ నార్నియా సినిమాలో ప్రిన్స్ కాస్పియన్ పాత్రని ఆడిషన్స్ ఇచ్చాను. నేను ఆ పాత్ర చేయాలని ఎంతో గట్టిగా ప్రయత్నించాను. దాదాపు సెలెక్ట్ కూడా అయ్యాను. కానీ అనంతరం ఆ క్యారెక్టర్ కోసం బెన్ బార్న్ తీసుకుంది చిత్ర బృందం. అయితే ఇదే విషయాన్ని నా ఏజెంట్‌ని అడిగితే వాళ్లు మీరు అంతా అందంగా లేరని ఎంపికచేయలేదని చెప్పింద’ని ఆయన వెల్లడించాడు.


ఆయన ఇంకా మాట్లాడుతూ.. ‘బెన్ చాలా అందంగా ఉంటాడు. మంచి టాలెంటెడ్ కూడా. కాబట్టి అతని ఎంపికపై నాకు ఎలాంటి అసంతృప్తి లేదు. ఆ చాలా బాగా తన పని చేశాడ’ని చెప్పాడు. అయితే 2010 ఈ సినిమా జరుగుతున్న సమయంలోనే గార్‌ఫీల్డ్ తన కెరీర్‌లో బెస్ట్ సినిమా అయిన ‘ది సోషల్ నెట్‌వర్క్‌’ చేశాడు. అందులో ఫేస్‌బుక్ కో ఫౌండర్ పాత్రని పోషించాడు.


అంతేకాకుండా గార్‌ఫీల్డ్ నటించిన ‘టిక్ టిక్ బూమ్’ సినిమాలో క్యారెక్టర్‌కి గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. అలాగే అందులో ఆయన నటనకి ఖచ్చితంగా ఆస్కార్‌కి నామినేట్ అవుతాడని అందరూ భావిస్తున్నారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement