Sep 23 2021 @ 01:12AM

మహేశ్‌ కోసం అద్భుతమైన ఐడియా

‘‘మంచి కథ రాయడం కష్టం కాదు. కామెడీతో కూడిన కథ చేయడం కష్టం. అందుకోసం చాలా స్ట్రగుల్‌ అవుతా. నా కామెడీకి, టైమింగ్‌కి సరైన కథలు ఎన్నుకున్న ప్రతిసారీ భారీ విజయాలొచ్చాయని స్వీయ విశ్లేషణలో తెలుసుకున్నా’’ అన్నారు శ్రీను వైట్ల. మహేశ్‌బాబు హీరోగా ఆయన దర్శకత్వం వహించిన ‘దూకుడు’ విడుదలై గురువారాని(సెప్టెంబర్‌ 23)కి పదేళ్లు. ఈ సందర్భంగా ‘చిత్రజ్యోతి’తో ప్రత్యేకంగా సంభాషించారు. శ్రీను వైట్ల మాట్లాడుతూ ‘‘జీవితంలో ఎప్పటికీ నేను మరువలేని ఓ అందమైన, మధురమైన జ్ఞాపకం ‘దూకుడు’. తండ్రీకుమారుల భావోద్వేగభరిత కథను వినోదాత్మకంగా చెప్పడమే విజయాన్ని తీసుకొచ్చింది. మహేశ్‌కు, నాకు మధ్య మంచి వేవ్‌లెంగ్త్‌ కుదిరింది. అందువల్లే, ‘దూకుడు’ విజయం వచ్చింది. ‘ఆగడు’లో హీరో ఎలివేషన్స్‌కు మంచి పేరొచ్చింది. ఇప్పుడు బ్యాక్‌ టు బ్యాక్‌ మూడు చిత్రాలు కమిటయ్యా. ఆ తర్వాత మహేశ్‌తో చేయాలనుంది. ఆయన కోసం ఓ అద్భుతమైన ఐడియా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే సినిమాగా దాన్ని తీయాలనుంది’’ అని చెప్పారు. విష్ణు మంచుతో చేయబోయే ‘డి్క్షడి’ గురించి శ్రీను వైట్ల మాట్లాడుతూ ‘‘నా నుంచి ప్రేక్షకులు ఎటువంటి సినిమా కోరుకుంటున్నారో... అలాంటి చిత్రమది. కొత్తదనం ఉంటుంది. డబుల్‌ డోస్‌ కామెడీ ఉంటుంది. అందుకే, ఆ క్యాప్షన్‌ పెట్టా. ఇది ‘ఢీ’కి సీక్వెల్‌ కాదు. వేరే కథ. నవంబర్‌లో సెట్స్‌ మీదకు వెళుతుంది’’ అన్నారు.