అమేజ్‌ఫిట్‌ స్మార్ట్‌ వాచ్‌

ABN , First Publish Date - 2020-10-24T06:46:58+05:30 IST

తక్కువ ధరలో అమేజ్‌ఫిట్‌ ‘స్మార్ట్‌వాచ్‌’ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. బడ్జెట్‌ ఫ్రెండ్లీగా పేర్కొన్న ఈ వాచ్‌ దీర్ఘచతురస్రాకారం డయల్‌తో మూడు రంగుల్లో లభ్యం కానుంది...

అమేజ్‌ఫిట్‌ స్మార్ట్‌ వాచ్‌

తక్కువ ధరలో అమేజ్‌ఫిట్‌ ‘స్మార్ట్‌వాచ్‌’ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. బడ్జెట్‌ ఫ్రెండ్లీగా పేర్కొన్న ఈ వాచ్‌ దీర్ఘచతురస్రాకారం డయల్‌తో మూడు రంగుల్లో లభ్యం కానుంది. కుడిపక్కన సింగిల్‌ బటన్‌కు తోడు స్ట్రాప్స్‌ను మార్చుకునే సౌలభ్యం కూడా ఉంది. ప్రస్తుతం చైనాలో విడుదలైంది. భారత కరెన్సీలో సుమారుగా దీని వెల రూ.3,900. అయితే సేల్స్‌ ప్రమోషన్‌ కింద దీన్ని రూ.3,300కే ప్రస్తుతానికి అందుబాటులోకి తెచ్చారు. వచ్చే నెల 1 నుంచి డెలివరీ చేయనున్నారు. 320 ్ఠ 302 పిక్సల్‌ సహా పలు  ఫీచర్లు ఉన్నాయి. పాలికార్బొనేట్‌తో బాడీ, సిలికాన్‌ రబ్బర్‌తో స్ట్రాప్‌ రూపొందించారు. రెండు గంటల్లో ఛార్జింగ్‌ పూర్తవుతుంది. తొమ్మిది రోజుల పాటు బ్యాకప్‌ ఉంటుంది. అలాగే 60కి మించి ప్రొఫెషనల్‌ మోడ్స్‌ను ట్రాక్‌ చేయవచ్చు. హార్ట్‌ బీట్‌, బ్లడ్‌లో ఆక్సిజన్‌ తదితర ఆరోగ్య సంబంధ సెన్సర్లు కూడా ఈ వాచ్‌లో ఉన్నాయి. ఇంతా చేసి దీని బరువు 31 గ్రాములే!

Updated Date - 2020-10-24T06:46:58+05:30 IST