Amarnath Yatraలో ఉగ్రదాడులను తిప్పికొట్టేందుకు రైల్వే పోలీసుల plan

ABN , First Publish Date - 2022-06-16T12:38:07+05:30 IST

అమర్‌నాథ్ యాత్ర సందర్భంగా ఉగ్రవాద దాడులను తిప్పికొట్టేందుకు జమ్మూకశ్మీర్ రైల్వే పోలీసులు ప్రత్యేక కంటిన్‌జెన్సీ...

Amarnath Yatraలో ఉగ్రదాడులను తిప్పికొట్టేందుకు రైల్వే పోలీసుల plan

శ్రీనగర్: అమర్‌నాథ్ యాత్ర సందర్భంగా ఉగ్రవాద దాడులను తిప్పికొట్టేందుకు జమ్మూకశ్మీర్ రైల్వే పోలీసులు ప్రత్యేక కంటిన్‌జెన్సీ ప్రణాళికను రూపొందించారు.43 రోజుల అమర్‌నాథ్ యాత్రలో ఏదైనా ఉగ్రవాద దాడులు జరిగితే వాటిని తిప్పికొట్టడానికి ఆకస్మిక ప్రణాళికను రూపొందించాలని జమ్మూకశ్మీర్ పోలీసులు చేసిన సూచనతో రైల్వే పోలీసులు సమాయత్తమయ్యారు.అమర్‌నాథ్ యాత్ర సందర్భంగా రైల్వేస్టేషన్లలో భద్రతా ఏర్పాట్లు పటిష్ఠం చేశామని జమ్మూ కశ్మీర్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (రైల్వేస్) సునీల్ కుమార్ చెప్పారు. ప్రభుత్వ రైల్వే పోలీసులు రైల్వేస్టేషన్లలో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.రైళ్లలో యాత్రికులు సౌకర్యవంతంగా ప్రయాణించేలా వివిధ రైల్వే స్టేషన్లలో కొద్దిసేపు ఆగిపోయేలా 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని సునీల్ కుమార్ అధికారులను ఆదేశించారు.


యాత్రికులు, ఇతర ప్రయాణికులతో వినయపూర్వకంగా వ్యవహరించాలని, వారికి ఏదైనా సహాయం చేయడానికి 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆయన అధికారులను కోరారు.ఏడీజీపీ జవాన్ల ఫిర్యాదులను కూడా విని, ప్రాధాన్యమిచ్చి ఫిర్యాదులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఐజీ సునీల్ కుమార్, ఉత్తర రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ ఏఎన్ మిశ్రాతో కలిసి కత్రా, ఉధంపూర్‌లలో మూడు రోజులపాటు పర్యటించారు.


Updated Date - 2022-06-16T12:38:07+05:30 IST