మూర్ఖపు నిర్ణయాన్ని మార్చుకోవాలి: అమర్‌నాథ రెడ్డి

ABN , First Publish Date - 2020-08-05T01:26:14+05:30 IST

మూడు రాజధానులు అనే మూర్ఖత్వపు నిర్ణయాన్ని మానుకోవాలని మాజీ మంత్రి అమర్‌నాథ రెడ్డి అన్నారు. మూడు రాజధానుల నిర్ణయంపై హైకోర్టు ఆదేశాలు హర్షనీయం అని పేర్కొన్నారు.

మూర్ఖపు నిర్ణయాన్ని మార్చుకోవాలి: అమర్‌నాథ రెడ్డి

చిత్తూరు: మూడు రాజధానులు అనే మూర్ఖత్వపు నిర్ణయాన్ని మానుకోవాలని మాజీ మంత్రి అమర్‌నాథ రెడ్డి అన్నారు. మూడు రాజధానుల నిర్ణయంపై హైకోర్టు ఆదేశాలు హర్షనీయం అని పేర్కొన్నారు. రాజధాని అంశంలో ఏపీ గవర్నర్ గెజిట్‌పై హైకోర్టు స్టే విధించడంపై స్పందించిన ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తప్పుడు నిర్ణయాలపై హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా ప్రభుత్వం మూర్ఖత్వంగా వ్యవహరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి భవిష్యత్తులోనూ భంగపాటు తప్పదన్నారు. జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల మూర్ఖపు నిర్ణయాన్ని ఇకనైనా మానుకోవాలని సూచించారు. అధికార వికేంద్రీకరణ సీఆర్డీఏ రద్దు పై హైకోర్టు స్టేటస్ కో  ఇవ్వడం శుభపరిణామమన్నారు.

Updated Date - 2020-08-05T01:26:14+05:30 IST