Abn logo
Sep 19 2021 @ 20:07PM

నేను చేయలేకపోయాను, కొత్త సీఎం అయినా చేయాలి: కెప్టెన్

చండీగఢ్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలను ఇవ్వలేకపోయానని, నూతన ముఖ్యమంత్రిగా ఎంపికైన చరణ్‌జిత్ సింగ్ చన్నీ అయినా వీలైనంత తొందరలో వారికి నియామక పత్రాలు ఇవ్వాలని తాజా మాజీ సీఎం అమరీందర్ సింగ్ అన్నట్లు ఆయన మీడియా సలహాదారు రవీన్ తుర్కల్ తెలిపారు. ఆదివారం ఈ విషయమై తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ అమరీందర్ వ్యాఖ్యల్ని ట్వీట్ రూపంలో వెల్లడించారు.


రవీన్ తుర్కల్ తన ట్విట్టర్ ఖాతాలో అమరీందర్ సింగ్ ఫొటో చేస్తూ ‘‘సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న పోరాటంలో చనిపోయిన 150 మంది రైతుల కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలను ఇప్పటి వరకు అందజేయకపోవడం విచారకరం. ముఖ్యమంత్రిగా నియమితులైన చరణ్‌జిత్ సింగ్ చన్నీ సాధ్యమైనంత తొందరగా ఆ పని పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను. న్యాయం కోసం పోరాడుతున్న రైతుల పక్షాన నేనెప్పటికీ నిలబడే ఉంటాను’’ అని కెప్టెన్ అమరీందర్ సింగ్ అన్నట్లు రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండిImage Caption