అల్లానే అండ

ABN , First Publish Date - 2020-05-26T08:49:09+05:30 IST

వివిధ ప్రాంతాల మట్టి, నీటితో పునీతమైన అమరావతికి అల్లానే అండ.. అంటూ సోమవారం రంజాన్‌ సందర్భంగా రాజధాని ..

అల్లానే అండ

గుంటూరు(ఆంధ్రజ్యోతి), తాడికొండ, మే 25: వివిధ ప్రాంతాల మట్టి, నీటితో పునీతమైన అమరావతికి అల్లానే అండ.. అంటూ సోమవారం రంజాన్‌ సందర్భంగా రాజధాని గ్రామాల్లోని ము స్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాలనంతా అమ రావతి నుంచే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు సోమవారానికి 160వ రోజుకు చేరాయి. రంజాన్‌ను పురస్కరించుకుని ముస్లీంలకు రైతులు, కూలీలు శుభాకాంక్షలు తెలిపి, మిఠాయిలు తినిపిం చారు. అలానే అమరావతికి తిరిగి ఊపిరి పోశారం టూ శాసన మండలి చైర్మన్‌ డాక్టర్‌ షరీఫ్‌ చిత్రపటా నికి రాయపూడి ముస్లీంలు, దళిత జేఏసీ నేతలు పా లాభిషేకం చేశారు. 29 గ్రామాల రైతులు, మహిళలు ఎవరి ఇళ్లలో వారు  నిరసనలు కొనసాగించారు. 

Updated Date - 2020-05-26T08:49:09+05:30 IST