అమరావతిని ఆపారు.. అప్పుల ఊబిలోకి నెట్టారు

ABN , First Publish Date - 2020-06-05T09:30:52+05:30 IST

అమరావతి నిర్మాణాలు నిలిపివేయటంతో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక రంగం కుదేలై.. అప్పుల ఊబిలోకి ..

అమరావతిని ఆపారు.. అప్పుల ఊబిలోకి నెట్టారు

170వ రోజు ఆందోళనలో ప్రభుత్వంపై రాజధాని రైతులు ధ్వజం


గుంటూరు(ఆంధ్రజ్యోతి), తాడికొండ, జూన్‌ 4: అమరావతి నిర్మాణాలు నిలిపివేయటంతో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక రంగం కుదేలై.. అప్పుల ఊబిలోకి నెట్టబడిందని ఆ ప్రాంత రైతులు తెలిపారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలంటూ రాజధానికి భూములిచ్చిన రైతులు, కూలీలు, మహిళలు చేస్తోన్న ఆందోళనలు గురువారానికి 170వ రోజుకు చేరాయి. పరిపాలనలో కాదు అభివృద్ధిలో వికేంద్రీకరణ చేయాలంటూ నినాదాలు చేశారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కోసం భూములిచ్చిన పాపానికి నేడు రోడ్డెక్కి ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతితోనే రాష్ట్రానికి వెలుగంటూ ఇళ్లలో విద్యుత్‌ దీపాలను ఆర్పి కొవ్వొత్తులు, దీపాలు వెలిగించి జై అమరావతి, సేవ్‌ అమరావతి అంటూ నినాదాలు చేశారు. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాలలో చేస్తున్న గ్రామస్థులు చేస్తోన్న నిరసనలు గురువారానికి 44వ రోజుకు చేరుకున్నాయి. 

Updated Date - 2020-06-05T09:30:52+05:30 IST