Abn logo
Aug 8 2021 @ 13:11PM

అమరావతి: పోలీసుల ఆంక్షలతో జనం ఇక్కట్లు

అమరావతి: అమరావతి ఉద్యమం 6వందల రోజులకు చేరుకున్న సందర్భంగా రాజధాని ఉద్యమకారులు ఆదివారం ర్యాలీకి పిలుపు ఇచ్చారు. హైకోర్టు నుంచి మంగళగిరి లక్ష్మినరసింహస్వామి ఆలయం వరకు ర్యాలీ నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఆలయానికి వచ్చే రహదారులలో పోలీసులు మోహరించారు. పలుచోట్ల రహదారులపై ముళ్లకంచెలు వేయడంతో సాధారణ ప్రజానీకం తీవ్ర అసౌకర్యానికి గురౌతోంది. ఎట్టి పరిస్థితుల్లో నిరసనర్యాలీ ఆలయం వైపు రాకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ఎలాగైనా ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకుని తీరతామని ఉద్యమకారులు చెబుతున్నారు. విజయవాడతోపాటు గుంటూరు జిల్లాలో పోలీసులు పలువురు అమరావతి జేఏసీ, టీడీపీ నేతలను హౌస్ అరెస్టు చేశారు.