ప్రకాశం: రైతు మహా పాదయాత్ర 150 కి.మీ. పూర్తిచేసుకుంది. పాదయాత్ర అపూర్వ జనాదరణతో సాగుతోందని ఈ సందర్భంగా అమరావతి జేఏసీ నేతలు తెలిపారు. జనాదరణ చూసైనా ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకుంటుందని ఆశిస్తున్నామన్నారు. రైతు పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలు సంఘీభావం తెలుపుతున్నారని చెప్పారు. అమరావతి రైతులు నిరసనలు చేపట్టి 700 రోజులవుతున్న సందర్భంగా రేపు వినూత్న కార్యక్రమాలు చేపడతామని అమరావతి జేఏసీ నేతలు వెల్లడించారు.