ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేస్తోంది మరొకటి

ABN , First Publish Date - 2020-07-01T08:49:47+05:30 IST

‘ఒక పక్క మంత్రి అమరావతిలో పర్యటించి పెండిం గ్‌లో ఉన్న భవన నిర్మాణాలు పూర్తిచేస్తాం, కరకట్టను రెండు వరుసల రహదారిగా విస్తరిస్తా మని చెబుతున్నారు.

ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేస్తోంది మరొకటి

196వ రోజు కొనసాగిన అమరావతి రైతుల ఆందోళనలు


గుంటూరు, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): ‘ఒక పక్క మంత్రి అమరావతిలో పర్యటించి పెండిం గ్‌లో ఉన్న భవన నిర్మాణాలు పూర్తిచేస్తాం, కరకట్టను రెండు వరుసల రహదారిగా  విస్తరిస్తా మని చెబుతున్నారు. కోర్టులో నేమో అధికారులు అమరావతి అంశం మండలిలో ఉందంటారు. మరో పక్క విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నింస్తోందని... సీఎం కార్యాలయం రుషికొండ ఐటీ పార్కులో, హిల్‌ నంబరు 2లో డీజీపీ కార్యాలయం అని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం బయటకు చెప్పేది ఒకటి.. చేస్తోంది మరొకటి’ అని అమరావతి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు మంగళవారానికి 196వ రోజుకు చేరాయి. ఇంటింటా అమరావతి కార్యక్రమం కింద రాజధాని గ్రామాల రైతులు, మహిళలు వివిధ రూపంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. జూలై 4వ తేదీకి ఉద్యమం మొదలై 200 రోజులు కావస్తున్న సందర్భంగా లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ సోషల్‌ మీడియా వేదికగా తాము పడుతున్న ఇబ్బందులు, తమ పోరాటాన్ని ప్రపంచానికి తెలియజేస్తామని రైతులు పేర్కొన్నారు.

Updated Date - 2020-07-01T08:49:47+05:30 IST