వైఖరి మార్చుకోవాలి

ABN , First Publish Date - 2020-06-03T09:45:59+05:30 IST

రాష్ట్రానికి మూడు రాజధానులని ప్రకటించిన ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని అమరావతి రైతులు, మహిళలు డిమాండ్‌ చేశారు.

వైఖరి మార్చుకోవాలి

జూలై 1 నుంచి రెండో దశ ఉద్యమం

168వ రోజు ఆందోళనలో అమరావతి రైతులు


గుంటూరు(ఆంధ్రజ్యోతి), తాడికొండ, జూన్‌ 2: రాష్ట్రానికి మూడు రాజధానులని ప్రకటించిన ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని అమరావతి రైతులు, మహిళలు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే సాగాలని రాజధాని రైతులు చేస్తోన్న ఆందోళనలు మంగళవారానికి 168వ రోజుకు చేరాయి. లాక్‌డౌన్‌ నిబం ధనలకు అనుగుణంగా 29 గ్రామాల రైతులు, మహిళలు, కూలీలు ఇళ్లలోనే ఉండి నిరసనలు కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో జూలై 1 నుంచి రెండో దశ ఉద్యమానికి సిద్ధ మౌతున్నట్లు చెప్పారు. మంగళవారం గుంటూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతంలో జూలై 1న కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరితో కలిసి కార్య క్రమం నిర్వహించి రెండోదశ ఉద్యమాన్ని ప్రారంభింప జేస్తామని హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు. అమరావతి తోనే రాష్ట్రానికి వెలుగంటూ కొవ్వొత్తులు, దీపాలు వెలిగిం చారు. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండల పరిధిలోని మోతడక, పొన్నెకల్లు గ్రామాలలో చేపట్టిన నిరసనలు మంగళవారానికి 42వ రోజుకు చేరుకున్నాయి.

Updated Date - 2020-06-03T09:45:59+05:30 IST