102 రోజు కొనసాగిన అమరావతి రైతుల ఆందోళనలు

ABN , First Publish Date - 2020-03-29T09:33:39+05:30 IST

ఎన్ని ఆటంకాలు ఎదురైనా పోరు ఆపేది లేదని రాజధాని రైతులు చెబుతున్నారు.

102 రోజు కొనసాగిన అమరావతి రైతుల ఆందోళనలు

గుంటూరు, తుళ్లూరు, మార్చి 27(ఆంధ్రజ్యోతి): ఎన్ని ఆటంకాలు ఎదురైనా పోరు ఆపేది లేదని రాజధాని రైతులు చెబుతున్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు శనివారం 102వ రోజుకు చేరాయి. రైతులు మాట్లాడుతూ సీఎం జగన్‌ మొండి అయితే.. మేము జగమొండి అని పేర్కొన్నారు.


  రైతులు, మహిళలు  ఇంటిల్లిపాది నిరసనల్లో పాల్గొన్నారు. ప్రతి గంటకు శానిటైజర్‌తో చేతులు శుభ్రపరుచుకున్నారు. మాస్కులు, కర్చీలు కట్టుకొని నిరసన తెలిపారు. రాజధానిపై ప్రభుత్వ తీరు మార్చుకోవాలంటూ రాత్రి 7.30 గంటలకు విద్యుత్‌ నిలిపి కొవ్వొత్తులు వెలిగించి నినాదాలు చేశారు. రాజధాని రైతు జేఏసీ సభ్యులు మాస్కులను ప్రతి ఇంటికి అందజేస్తున్నారు. న్యాయదేవత తమకు అండగా ఉందని రాజధాని రైతులు, కూలీలు అంటున్నారు.

Updated Date - 2020-03-29T09:33:39+05:30 IST