Abn logo
Sep 25 2020 @ 07:41AM

283వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల నిరసనలు

అమరావతి: మూడు రాజధానులు వద్దు, అమరావతే ముద్దు అంటూ రాజధాని గ్రామాల రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 283వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఐనవోలు, ఉద్దండరాయని పాలెం, పెడపరిమి, దొండపాడు, నెలపాడు, ఆనంతవరం, నీరుకొండ తదితర గ్రామాల్లోని శిబిరాల్లో  రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం చేశారు. కరోనా సూచనలు పాటిస్తూ అమరావతి ఉద్యమం సాగుతోంది.

Advertisement
Advertisement