లాక్‌డౌన్‌ అంటూ ‘కోత’లొద్దు: కేంద్రం

ABN , First Publish Date - 2020-04-03T08:58:40+05:30 IST

లాక్‌డౌన్‌ అంటూ ‘కోత’లొద్దు: కేంద్రం

లాక్‌డౌన్‌ అంటూ ‘కోత’లొద్దు: కేంద్రం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 2: లాక్‌డౌన్‌కు ముందు చేసినట్టే  పునరుత్పాదక విద్యుదుత్పత్తి సంస్థల నుంచి విద్యుత్‌ కొనుగోళ్లు యథాతథంగా కొనసాగించాలని, వాటికి బకాయిలు చెల్లించాలని రాష్ర్టాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ ఈనెల 1న అన్ని రాష్ర్టాలకు, విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లకు లేఖలు రాసింది. పునరుత్పాదక విద్యుదుత్పత్తి స్టేషన్లకు ‘తప్పనిసరిగా నడపాల్సిన(మస్ట్‌ రన్‌)’ హోదా కల్పించామని, లాక్‌డౌన్‌లోనూ అది కొనసాగాల్సిందేనని స్పష్టం చేసింది.

Updated Date - 2020-04-03T08:58:40+05:30 IST