వాహనదారుడిపై నోరుపారేసుకున్న కోలగట్ల

ABN , First Publish Date - 2020-04-03T08:57:53+05:30 IST

వాహనదారుడిపై నోరుపారేసుకున్న కోలగట్ల

వాహనదారుడిపై నోరుపారేసుకున్న కోలగట్ల

విజయనగరం, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఓ వాహనదారుడిపై దుర్భాషలాడుతూ మండిపడిన తీరు చర్చనీయాంశమైంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో జిల్లాలో 144 సెక్షన్‌ అమలవుతోంది. పోలీసు సిబ్బంది ఎంతగా చెబుతున్నా వివిధ అవసరాల పేరుతో జనం రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. దీనిని గుర్తించిన ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి  ప్రజలకు అవగాహన కల్పించేందుకు తన వాహనంతో బుధవారం పట్టణంలో తిరిగారు. బాలాజీ జంక్షన్‌ వద్ద ద్విచక్ర వాహనంపై వస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నా రు. అదే సమయంలో వాహనంపై అటుగా వచ్చిన ఎమ్మెల్యే అక్కడ ఆగారు. వాహనదారుడిపై మండిపడ్డారు. ‘ల... కొడుకులు’ అంటూ పరుష పదజాలాన్ని వాడారు. దీంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. 

Updated Date - 2020-04-03T08:57:53+05:30 IST