విద్యాశాఖలో నాడు నేడు కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష

ABN , First Publish Date - 2021-06-17T17:59:31+05:30 IST

విద్యాశాఖలో నాడు నేడు కార్యక్రమంపై సీఎం జగన్ గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

విద్యాశాఖలో నాడు నేడు కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష

అమరావతి: విద్యాశాఖలో నాడు నేడు కార్యక్రమంపై సీఎం జగన్ గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏపీ టెన్త్ పరీక్షల నిర్వహణపై  విద్యాశాఖ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. జూలై 26 నుంచి ఆగస్టు 2 వరకు టెన్త్ పరీక్షలకు ప్రతిపాదనలు తీసుకువచ్చింది. జులై 7 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహణకు ఇంటర్ బోర్డ్ నుండి ప్రతిపాదనలు చేసింది. 4 వేల సెంటర్లలో టెన్త్ పరీక్షల నిర్వహణ ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. 11 పేపర్లకు బదులు ఏడు పేపర్లకి పరీక్షలు నిర్వహించాలని సూచించారు. సెప్టెంబర్ 2లోగా 10వ పరీక్షా ఫలితాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు నాడు-నేడు సమీక్షలో సీఎం జగన్  తుది నిర్ణయం తీసుకుంటారని విద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశానికి మంత్రి ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Updated Date - 2021-06-17T17:59:31+05:30 IST