Advertisement
Advertisement
Abn logo
Advertisement

అమరావతి రైతులకు సంఘీభావం

జంగారెడ్డిగూడెంలో టీడీపీ భారీ పాదయాత్ర

జంగారెడ్డిగూడెం, డిసెంబరు 4 : అమరావతి రైతుల పాదయాత్రకు సంఘీభావంగా జంగారెడ్డిగూడెం పట్టణ, మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పాదయాత్ర చేపట్టారు. జంగారెడ్డిగూడెం కోర్టు వద్ద శనివారం ఉదయం పది గంటలకు మొదలైన పాదయాత్ర గోకుల పారిజాతగిరి దేవస్థానం వరకు సాగింది. రైతులు, మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలు ఏకైక రాజధాని అమరావతే ఉండాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పార్టీ ఏలూరు పార్లమెంట్‌ నియోజవర్గ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ ఏకైక రాజధానిగా అమరావతిని సాధించే వరకు పోరాటం సాగుతూనే ఉంటుందన్నారు. అసెంబ్లీలో బిల్లు ఉపసంహరించుకుని, మళ్లీ మూడు రాజధానుల ప్రతిపాదన పెడతామని చెప్పడం దుర్మార్గమన్నారు. పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు మద్దతు పలుకుతున్నామని చెప్పారు. దుర్మార్గ పరిపాలన చేస్తున్న జగన్‌ మాట తప్పను మడమ తిప్పనని చెబుతూనే రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్‌ దాసరి శ్యామ్‌చంద్రశేషు, జయవరపు శ్రీరామమూర్తి, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, జడ్పీ మాజీ చైర్మన్‌ కొక్కిరిగడ్డ జయరాజు, నేతలు రావూరి కృష్ణ, సాయిల సత్యనారాయణ, మండవ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement